Delhi Police Woman : రేప్‌కేసు నిందితుడి కోసం ఫేస్‌బుక్ ఫ్రెండ్‌గా మారిన మహిళా ఎస్ఐ… ఆతర్వాత….

మైనర్ బాలికపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని పట్టుకోటానికి మహిళా ఎస్ఐ సోషల్ మీడియాలో ఫ్రెండ్ షిప్ చేసి పట్టుకుంది.

Delhi Police Woman : రేప్‌కేసు నిందితుడి కోసం ఫేస్‌బుక్ ఫ్రెండ్‌గా మారిన మహిళా ఎస్ఐ… ఆతర్వాత….

Delhi Sub Inspector

Delhi Police Woman : మైనర్ బాలికపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని పట్టుకోటానికి మహిళా ఎస్ఐ సోషల్ మీడియాలో ఫ్రెండ్ షిప్ చేసి పట్టుకుంది.  ఢిల్లీలోని గాజుల దుకాణంలో పని చేసే యువకుడు అమ్మాయిలను లైంగికంగా వాడుకుని వదిలేయటం మొదలెట్టాడు. అందుకోసం సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఫేస్ బుక్ లో వివిధ రకాల పేర్లతో ప్రోఫైల్స్ క్రియేట్ చేశాడు.

అందులో పరిచయం అయిన యువతులను, మహిళలను ట్రాప్ చేసి లైంగికంగా వాడుకుని వదిలేసేవాడు. ఇదే క్రమంలో ఢిల్లీకి చెందిన 16 సంవత్సరాల యువతిని లైంగికంగా వాడుకున్నాడు. తదనంతర   కాలంలో ఆ యువతి గర్భం దాల్చింది. అబార్షన్ కోసం ఆస్పత్రికి వెళితే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఆస్పత్రికి వచ్చిన పోలీసులు యువతిని వివరాలు అడిగారు. పోలీసులను చూసి తనపై జరిగిన అత్యాచారం  వివరాలు చెప్పటానికి యువతి నిరాకరించింది.

కానీ మహిళా ఎస్సై ప్రియాంక  షైనీ వచ్చి ధైర్యం చెప్పటంతో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు తన ఇంటి దగ్గరవాడేనని కొద్ది రోజుల క్రితం స్నేహం ఏర్పడిందని… అనంతరం సన్నిహితంగా కలిశామని చెప్పింది.  యువతి గర్భం దాల్చినప్పటి  నుంచి కనిపించకుండా తప్పించుకు తిరుగుతన్నాడని యువతి తెలిపింది.

కాగా నిందితుడికి  చెందిన ఫోన్ నెంబరు కూడా ఇవ్వలేక పోయింది. దీంతో ఎస్సై   ప్రియాంక షైనీ యువతి  చెప్పిన ఆధారాలతో ఫేస్ బుక్ లోని   సుమారు 100 ప్రోఫైల్  ఫోటోలు చూపించింది. అందులో ఒక వ్యక్తిని  యువతి గుర్తుపట్టింది.  అతని ఫేస్ బుక్ ఎకౌంట్ పరిశీలించిన   ఎస్సైకి   నిందితుడు సోషల్ మీడియా  ద్వారా యువతులను  మోసం చేస్తున్నట్లు గ్రహించింది. వెంటనే తాను ఒక ఫేక్ ఎకౌంట్   క్రియేట్ చేసి నిందితుడికి   ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది.

అమ్మాయిల కోసం వెతుకుతున్న నిందితుడు అమ్మాయి వద్ద నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చే సరికి యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి కొన్ని రోజులపాటు అతనితో చాటింగ్ చేయటం మొదలెట్టింది.  ఆక్రమంలో నిందితుడి పోన్ నెంబర్, అడ్రస్ ఇవ్వమని అడిగితే నిరాకరించాడు.  పర్సనల్ గా కలిస్తే అన్నీ మాట్లాడుకుందాం  రమ్మని చెప్పాడు. ఓకే వస్తాను….అని అతడ్ని నమ్మించి మొత్తానికి నిందితుడి  మొబైల్ నెంబర్ సంపాదించింది ఎస్సై షైనీ.

జులై 31న   షైనీని కలుస్తానని చెప్పాడు.  రాత్రి గం.7-30కి  స్ధానిక దశరధపురం రైల్వేస్టేషన్‌కు  రమ్మన్నాడు.  అప్పటికే అక్కడ సివిల్ డ్రస్‌లో  పోలీసులను పెట్టిన షైనీ అక్కడకు వెళ్లింది.  కానీ నిందితుడు అంతకంటే తెలివిగా.. అక్కడ  కాదు  వేరే అపార్ట్ మెంట్ లో కలుద్దామని చెప్పాడు.  దీంతో ఆమె అక్కడకు వెళ్లింది.  నిమిషాల వ్యవధిలోనే అక్కడ కాదు శ్రీమాతా మందిర్ మహావీర్ ఎన్‌క్లేవ్ కు రమ్మనమని చెప్పాడు.

అక్కడకు వెళ్ళిన ప్రియంకా షైనీ నిందితుడ్ని అరెస్ట్ చేసింది.  పోలీసుల విచారణలో నిందితుడు తన తప్పు ఒప్పుకున్నాడు. ఇప్పటికి గత 15 నెలల కాలంలో ఆరుగురు యువతులను కలిసినట్లు చెప్పాడు.  వారితో శారీక వాంఛ  తీరిపోగానే వాళ్లను తప్పించుకు తిరుగుతున్నట్లు వివరించాడు. ఎవరికీ తన అసలు పేరు గానీ, సరైన ఫోన్ నెంబరు కానీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లు….. తరచూ ఇళ్లు మారుస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.