Delhi Commission for Women: అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ

స్పాలో పని చేసే ఒక యువతిపై మేనేజర్‌తోపాటు, కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Delhi Commission for Women: అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ

Delhi Commission for Women: దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. బాధిత యువతి శనివారం ఢిల్లీలోని మహిళా కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరింది. ఈ అత్యాచార ఘటనకు సంబంధించి వెల్లడైన వివరాల ప్రకారం.. స్థానిక పితాంపుర ప్రాంతంలో ఉన్న ‘ద ఓషన్ స్పా’లో బాధిత యువతి పని చేస్తుండేది.

Jawan Fires: సహచరులపై జవాన్ కాల్పులు.. ఒకరి మృతి

ఆమెకు స్పా మేనేజర్ ఒక కస్టమర్‌ను పరిచయం చేశాడు. తర్వాత మేనేజర్, కస్టమర్ కలిసి ఆమెకు డ్రింక్ అందించారు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ ఘటన గురించి బయటకు చెప్పొద్దని ఆమెను బెదిరించారు. డబ్బులు ఇచ్చి, విషయం సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. అయితే, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే శనివారం ఢిల్లీలోని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్ ఢిల్లీ పోలీసులకు, మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీతోపాటు, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. అలాగే స్పాకు లైసెన్స్ ఉందా.. లేదా కూడా పరిశీలించాలని కోరింది.

Niti Aayog: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు.. తెలంగాణ సీఎం ఆరోపణలపై స్పందించిన నీతి ఆయోగ్

ఈ నెల 8లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ‘‘స్పా ముసుగులో ఢిల్లీలో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. బాధితులకు బెదిరింపులు రావడం వల్ల ఈ ఘటనలపై చాలా మంది ఫిర్యాదు చేయడం లేదు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి’’ అని స్వాతి మాలివాల్ సూచించారు. తాజా ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నడుస్తున్న స్పాలను కూడా మూసేయాలని ఆమె ఆదేశించారు.