దిశ కేసు : నేడు మృతదేహాలకు రీపోస్టుమార్టం.. ఆ వెంటనే అంత్యక్రియలు

దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 02:17 AM IST
దిశ కేసు : నేడు మృతదేహాలకు రీపోస్టుమార్టం.. ఆ వెంటనే అంత్యక్రియలు

దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం

దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తారు. ఒక్కొక్క మృతదేహానికి రెండు గంటల సమయం పట్టే  అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తైన తరువాత సాయంత్రం 5గంటలకు ఎయిమ్స్ బృందం హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. మరోవైపు నిందితుల మృతదేహాలకు ఇవాళే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధం లేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ విజ్ఞప్తి మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు(ఎయిమ్స్) చెందిన నలుగురు ఫోరెన్సిక్‌ నిపుణులతో కూడిన టీమ్ ఆదివారమే(డిసెంబర్ 22,2019) హైదరాబాద్ చేరుకుంది.

ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలో ఆదర్శ్ కుమార్, అభిషేక్ యాదవ్, వరుణ చంద్ర టీమ్ ఉదయం 9 గంటలకు గాంధీ ఆస్పత్రికి చేరుకోనుంది. మార్చురీలో ఉన్న దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించనుంది. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరచనున్నారు. ఆ నివేదికను సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్‌కు  అందజేయనున్నారు. 

రీపోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను బంధువులకు అప్పగించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రక్రియ పూర్తి కాగానే నలుగురు నిందితుల మృతదేహాలను  వారి బంధువులకు పోలీసులు అప్పగించనున్నారు. నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా.. వెంటనే అంత్యక్రియలు జరిపించేలా వారి కుటుంబాలను పోలీసులు ఒప్పించనున్నట్లు తెలుస్తోంది.

* నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం
* గాంధీ ఆసుపత్రిలో ప్రక్రియ
* ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం
* ఒక్కో మృతదేహం రీపోస్టుమార్టంకు 2 గంటల సమయం
* పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్
* రీపోస్టుమార్టం రిపోర్ట్ ను సా.5గంటల్లోపు కోర్టుకి సమర్పించనున్న వైద్యులు
* డిసెంబర్ 6న చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్
* డిసెంబర్ 9న గాంధీ ఆసుపత్రికి మృతదేహాలు తరలింపు
* రీపోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగింత
* రీపోస్టుమార్టం ముగిసిన వెంటనే అంత్యక్రియలు