దిశా నిందితుల ఎన్ కౌంటర్ : అడ్వకేట్ ప్రసన్న హర్షం

  • Published By: madhu ,Published On : December 6, 2019 / 02:30 AM IST
దిశా నిందితుల ఎన్ కౌంటర్ : అడ్వకేట్ ప్రసన్న హర్షం

దిశా నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై లాయర్ అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు. దిశాను ఎక్కడైతే హత్యాచారం చేశారో..అక్కడే నిందితులను తీసుకెళ్లడం..స్పీడుగా రిజల్ట్ తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ కేసులో సీపీ సజ్జనార్ చేసిన కృషికి మహిళల నుంచి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. జరిగిన అన్యాయంపై ఈ రోజు అసలైన రిజల్ట్ వచ్చిందని, ఇప్పుడు మాకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి న్యాయమే కావాలని, తాము పోలీసు డిపార్ట్ మెంట్ ఇబ్బంది పెడితే..దయచేసి అర్థం చేసుకోవాలన్నారు. దిశా ఘటన అనంతరం ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చిందో గమనించాలన్నారు. ఈ కేసును టేకప్ చేయబోమని అడ్వకేట్స్ ప్రకటించడం హర్షనీయమన్నారు. జైల్లో కూర్చొని మేపడం, తమ కళ్ల ముందు తిరుగుతుంటే..తాము తట్టుకోలేకపోయామన్నారు. ఇలాంటి కేసుల్లో మెర్జ్ పిటిషన్ అవసరం లేదన్నారు. లిక్కర్‌ను ప్రభుత్వం అరికట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. 

డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా చటాన్ పల్లి వద్ద నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు (మహ్మద్‌, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్‌‌‌)లపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. దీనిని సీపీ సజ్టనార్ నిర్ధారించారు. 

* నవంబర్ 27వ తేదీన దిశాను నిందితులు అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపారు.
* దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. 
* ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 
* ఏ 1 మహ్మద్‌, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్ కుమార్‌‌లుగా నిర్ధారించారు. 
* బాధితురాలిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆమెను హత్య చేసి పెట్రోల్‌తో నిప్పులు పెట్టిన వైనం ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది.  ఆ నలుగురు * నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేశారు.
* నిందితులు ఆమెను ఎంతగా హింసించారో.. వారిని కూడా అదే విధంగా హింసించాలని అంటున్నారు.