పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 08:16 AM IST
పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు

దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్‌లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై CJI వాదించారు. ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ వేయడం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో ఈ సమయంలో పిటిషన్‌ను విచారించలేమని సుప్రీం దిశ నిందితుల కుటుంబాల తరపున వాదిస్తున్న న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఏదైమైనా చెప్పాలని అనుకుంటే…న్యాయ విచారణ కమిషన్‌కు చెప్పుకోవచ్చని సూచించింది. కమిషన్ నివేదిక ఇచ్చాక కూడా..న్యాయం జరగలేదని భావిస్తే…మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. CJI సూచనలతో న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

దిశ హత్య కేసు సంచలనం : –
దేశవ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు సంచలనం సృష్టించింది. 
దిశా హత్యాచారం కేసులో నలుగురు నిందితులు పారిపోతుండగా కాల్చి చంపేశారు పోలీసులు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విచారిస్తుండగా నిందితులు పోలీసులపైకి దాడికి యత్నించారు. పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు చనిపోయారు. దీనిని సీపీ సజ్జనార్ ధృవీకరించారు. ఘటనాస్థలాన్ని సీపీ పరిశీలించారు. 
 

–  అసలు ఎప్పుడే జరిగింది. 
* 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి దిశా ఆచూకి తెలియలేదు. 
* నవంబర్ 28వ తేదీ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో దిశ దారుణ హత్యకు గురైంది. 
* 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. 

* హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. 
* నిందితులంతా దిశా స్కూటీని పంక్చర్‌ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్‌ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్‌ చేశారు.
* దిశా రేప్ అండ్ మర్డర్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 

* నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. 
* కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 
* ఏ 1 మహ్మద్‌, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్ కుమార్‌లుగా వెల్లడించారు. 

* నవంబర్ 29వ తేదీన షాద్ నగర్ పీఎస్‌లో నిందితులను విచారించారు. 
* నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
* నవంబర్ 30న నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు. 

* షాద్ నగర్ నుంచి నిందితులను జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. 
* నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపించాయి. 
* చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నారు. 

* తొలుత అలాగే భావించినా చివరకు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. 
* హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
* మంత్రి కేటీఆర్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. చట్టాలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. 

* డిసెంబర్ 04వ తేదీన నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. 
* డిసెంబర్ 05వ తేదీన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 
* డిసెంబర్ 05వ తేదీన పోలీసుల విచారణ.
 

* నిందితుల సమాచారంతో దిశ సెల్ ఫోన్ స్వాధీనం.
* సంఘటనా స్థలంలో కీలక సాక్ష్యాలు సేకరించారు. 
* డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం నలుగురు నిందితుల ఎన్ కౌంటర్. 

Read More : జాగ్రత్తగా ఉండండి : పంజా విసురుతున్న కరోనా వైరస్