DMK MP TRVS Ramesh : బలవంతంగా విషం తాగించి హత్య చేసిన కేసులో డీఎంకే ఎంపీ కోర్టులో లొంగుబాటు

తన ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికునితో బలవంతంగా విషం తాగించి హత్య చేసారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న డీఎంకే ఎంపీ సోమవారం కోర్టులో లొంగిపోయారు.

DMK MP TRVS Ramesh : బలవంతంగా విషం తాగించి హత్య చేసిన కేసులో డీఎంకే ఎంపీ కోర్టులో లొంగుబాటు

Dmk Mp Surrender In Court

DMK MP TRVS Ramesh :  తన ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికునితో బలవంతంగా విషం తాగించి హత్య చేసారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న డీఎంకే ఎంపీ సోమవారం కోర్టులో లొంగిపోయారు.  తమిళనాడు కడలూర్ డీఎంకే ఎంపీ టీ.ఆర్.వీ.ఎస్. రమేష్ సోమవారం పన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆయనకి రెండు రోజుల రిమాండ్ విధించింది.

గాయత్రి జీడి పప్పు ఫ్యాక్టరీలో పని చేస్తున్న గోవిందరాజన్(60) అనే వ్యక్తిని జీడిప్పపు దొంగిలించాడనే ఆరోపణతో  హింసించటమే కాకుండా అతని చేత బలంవంతంగా విషం తాగించి హత్య చేసినట్లు ఎంపీ రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎంపీ వ్యక్తిగత సహాయకుడు నటరాజన్(31), ఆ పరిశ్రమ మేనేజర్ కందవేల్(49),ఇతర కార్మికులు అల్లాపిచ్చై(53), సుందర్ రాజన్ (31), వినోద్(31) అనే వారిని సీబీసీఐడీ వర్గాలు ఇప్పటికే అరెస్ట్ చేశాయి.

Also Read : Molestation : వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్

ఎంపీని కూడా అరెస్ట్ చేస్తారనే వార్తల నేపధ్యంలో ఆయన నిన్న కోర్టులో లొంగిపోయారు. కాగా రిమాండ్ కు వెళ్లే సమయంలో రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈకేసులో తాను నిర్దోషినని… కొన్ని రాజకీయ పార్టీలు తనమీద వచ్చిన ఆరోపణల్నిరాజకీయం చేసే పనిలో పడ్డాయని.. అందుకే కోర్టులో లొంగిపోయానని వివరించారు.

కేసు వివరాల్లోకి వెళితే మేల్మంపట్టు గ్రామానికి చెందిన గోవిందరాజు ఎంపీ రమేష్ కు చెందిన గాయత్రి జీడిపప్పు ఫ్యాక్టరీలోపని చేస్తున్నాడు. సెప్టెంబర్ 19న ఫ్యాక్టరీకి వెళ్లిన గోవిందరాజు ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతని కుమారుడు సెంథిల్ వేల్ కదంపులియూర్ పోలీస్ స్టేషన్ లో తన తండ్రి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశాడు.

Also Read : Rape Attempt : వదినపై కన్నేసిన మరిది… అన్న ఇంట్లో లేని సమయంలో…..

కాగా…సెప్టెంబర్ 20 తెల్లవారు ఝూమున గం.2-25లకు తన తండ్రి మొబైల్ ఫోన్ నుండి ఎంపీ వ్యక్తిగత సహాయకుడు తనకు ఫోన్ చేశారని…తన తండ్రి విషం తాగాడని…. పన్రుట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అక్కడ అతను చనిపోయాడని చెప్పాడని వివరించాడు. తన తండ్రి శవాన్ని పరీశిలంచగా తన తండ్రి శరీరంలోని అనేక భాగాలు, మరియు బట్టలపై రక్తపుమరకలు ఉన్నాయని కన్ను,ముఖం,మెడపై గాయాలున్నాయని తెలిపాడు. కదంపులియూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంతలో, పీఎంకే యొక్క లీగల్ యూనిట్ ఈకేసును సీబీఐ చేత విచారణ చేయించాలని కోరుతూ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. ఎంపీ అతని సహచరులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 27న ఈ కేసు సీబీసీఐడీకి బదిలీ చేయబడింది. సీబీసీఐడీ ప్రాధమిక విచారణ చేపట్టి ఎంపీ మరో ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 302, 201, 341, 147,149, 120-బీ కింద కేసులు నమోదు చేసింది.