వైద్యం కోసం వెళ్తే ప్రాణం తీశారు

రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 10:04 AM IST
వైద్యం కోసం వెళ్తే ప్రాణం తీశారు

రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. ప్రాణం పోయాల్సిన డాక్టర్ ప్రాణం తీశారు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు. వైద్యం వికటించి మృతి చెందారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

భీమయ్య(33), స్వాతి భార్యాభర్తలు. రాజేంద్రనగర్‌ మండలంలోని కాళీమందిర్‌ సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్నారు. భీమయ్య కొంతకాలంగా పైల్స్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దీంతో ఆపరేషన్‌ చేయించుకోవడం కోసం 3 రోజుల క్రితం షాదన్‌ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేశారు.

కాగా ఆపరేషన్‌ అనంతరం వైద్యం వికటించడంతో భీమయ్య మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డాక్టర్‌ నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందారని మృతుడి భార్య స్వాతి ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టింది. 

కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి స్వాతి ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.