చిన్నారికి సర్జరీ‌.. బిల్లు కట్టలేదని కుట్లు వదిలేసిన వైద్యులు.. పాప మృతి

చిన్నారికి సర్జరీ చేశాక బిల్లు కట్టలేదని కుట్లు వేయకుండా వదిలేశారు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రిలో బిల్లులు పూర్తిగా చెల్లించకపోవడంతో సర్జరీ చేసిన వైద్యులు కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అ‍‍ప్పగించారు.

చిన్నారికి సర్జరీ‌.. బిల్లు కట్టలేదని కుట్లు వదిలేసిన వైద్యులు.. పాప మృతి

Doctors leave stitches after surgery  : చిన్నారికి సర్జరీ చేశాక బిల్లు కట్టలేదని కుట్లు వేయకుండా వదిలేశారు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రిలో బిల్లులు పూర్తిగా చెల్లించకపోవడంతో సర్జరీ చేసిన వైద్యులు కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అ‍‍ప్పగించారు.

కాసేపటికి పాప తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో వెలుగు చూసింది. బాధిత కుటుంబం చెప్పిన ప్రకారం.. కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్‌ టౌన్‌కు చెందిన మూడు ఏళ్ల చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి వచ్చింది.

ఆ చిన్నారిని ప్రయాగ్‌ రాజ్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలన్నారు. కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్‌ చేశారు. హాస్పిటల్‌ బిల్లులు మొత్తం కట్టలేకపోయారు.

ఆ కారణంతో సర్జరీ చేశాక కుట్లు వేయకుండానే పాపను అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలు వైరల్‌ కావడంతో ఉన్నత వైద్యాధికారులు స్పందించారు. పాప కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు.