మహిళను మృగాడి నుంచి రక్షించిన కుక్క 

ఓ వీధికుక్క ఇంటికి కాపాలకాయడమేకాకుండా ఆ ఇంటి యజమానురాలిని ఓ మృగాడి నుంచి రక్షించింది.

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 07:18 PM IST
మహిళను మృగాడి నుంచి రక్షించిన కుక్క 

ఓ వీధికుక్క ఇంటికి కాపాలకాయడమేకాకుండా ఆ ఇంటి యజమానురాలిని ఓ మృగాడి నుంచి రక్షించింది.

భోపాల్ : శునకం.. విశ్వాసానికి మారుపేరని అందరికీ తెలిసిన విషయమే. అయితే విశ్వాసానికి మారుపేరుగా నిలిచి శునకం మరోసారి వార్తళ్లోకెక్కింది. కొద్దిగా తిండి పెట్టి చేరదీసినందుకు ఓ వీధికుక్క ఇంటికి కాపాలకాయడమేకాకుండా ఆ ఇంటి యజమానురాలిని ఓ మృగాడి నుంచి రక్షించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని చోళ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చోల ప్రాంతానికి చెందిన ఓ మహిళపై ఆమె ఇంటి పక్కనే నివసించే సునీల్‌ తాగిన మైకంలో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో అతడు తిట్టడం మొదలు పెట్టాడు. ఈ ఘటనను గమనించిన శేరు అనే శునకం ఆ మహిళను కాపాడటానికి అతడిపై దాడి చేసింది. దాంతో ఆందోళనకు గురైన సునీల్.. దాన్నుంచి తప్పించుకోవడానికి శునకాన్ని కత్తితో పొడిచి, అక్కడి నుంచి పారిపోయాడు.

కాస్త అన్నం పెట్టినందుకు ఆ శునకం అంతటి విశ్వాసాన్ని చూపించింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..తాము ఉండే కాలనీలోనే సునీల్ కూడా ఉంటాడని, ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం అతడు తప్పించుకొని తిరుగుతున్నాడని, త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. గాయపడిన శేరుకు చికిత్స అందిస్తున్నామన్నారు.