Hyd Drugs : టోనీ మూడో రోజు విచారణ.. ఫోన్ల ఫోరెన్సిక్ నివేదిక కీలకం

టోనీకి సంబంధించిన రెండు ఫోన్ల డేటా కీలకంగా మారింది. టోనీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ఆర్ఐ చలసాని వెంకట్ కీలకంగా మారాడు. 2.0 టీబీ డేటా మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ నివేదిక వస్తే..

Hyd Drugs : టోనీ మూడో రోజు విచారణ.. ఫోన్ల ఫోరెన్సిక్ నివేదిక కీలకం

Tony

Peddler Drug Peddler Tony : డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ టోనీని మూడో రోజు విచారణ జరుపనున్నారు పోలీసులు. విచారణలో బాగంగా రంగంలోకి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ & నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధ కిషన్ & సీఐ నాగేశ్వర రావులు రంగంలోకి దిగనున్నారు. విచారణలో సబ్ కొరియర్ & సబ్ ఏజెంట్స్ రిక్రూట్మెంట్ పై ఆరా తీసే అవకాశం ఉంది. ఏజెంట్స్ లుగా ఉన్న ఇమ్రాన్ బాబు షేక్ & అల్తాఫ్ లను ఎక్కడ కలిశాడు ? వారితో డ్రగ్స్ ఎక్కడ నిల్వ చేసేవారు ? వాటి లావాదేవీలపై  ప్రశ్నించనున్నారు. ముంబైలో జరిగిన ఒ పార్టీలో టోనీతో హైదరాబాద్ కన్స్ట్రక్షన్ వ్యాపార వేత్త శాశ్విత్ జైన్ తో పాల్గొనడం అతనితో గల సంబంధాలపై ప్రశ్నించనున్నారు. ఇతని ద్వారా హైదరాబాద్ లో ఎంత మంది వ్యాపారులను పరిచయం చేసుకున్నాడు ? ముంబైలో టోనీనీ ఎంత మంది వ్యాపారవేత్తలు నేరుగా కలిశాడనే దానిపై దృష్టి సారించారు. చంచల్ గూడ జైల్ లో ఉన్న ఏడు మందిలో A11 గా శాశ్విత్ జైన్ ఉన్నాడు. జనవరి 6న టోనీ అనుచరులు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడడంతో ఈ విషయం తెలిసింది.

Read More : Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!

తన సెల్ ఫోన్ లో ఉన్న వ్యాపారవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని శాశ్విత్ జైన్ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే..టోనీకి సంబంధించిన రెండు ఫోన్ల డేటా కీలకంగా మారింది. టోనీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ఆర్ఐ చలసాని వెంకట్ కీలకంగా మారాడు. 2.0 టీబీ డేటా మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ నివేదిక వస్తే ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 2013లో టూరిస్టు వీసాపై ముంబయి చేరిన టోనీ కొన్నాళ్లు సజావుగానే ఉన్నాడు. అక్కడ నైజీరియన్‌ స్మగ్లర్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత మత్తుపదార్థాల వ్యాపారంలోకి ప్రవేశించినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. తక్కువ వ్యవధిలోనే అంతర్జాతీయ స్థాయిలో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్నాడు.

Read More : Telangana : డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్న తెలంగాణ

అంతర్జాతీయ స్మగ్లర్‌ స్టార్‌బాయ్‌ సంస్థతో సంబంధాలు కొనసాగించాడు. రెండోరోజు విచారణలో పోలీసులు స్టార్‌బాయ్‌తో కొనసాగించిన లావాదేవీలపై ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ముంబయి కేంద్రంగా ఏళ్ల తరబడి మాదకద్రవ్యాల దందా సాగించిన టోనీ ఎక్కడా వ్యక్తిగత ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే లావాదేవీలు నిర్వహించాడు. టోనీ మాదకద్రవ్యాల సరఫరాకు 20 మంది ఏజెంట్లను ఉపయోగించాడు. వీరిలో ఇమ్రాన్‌బాబు షేక్‌తో మాత్రమే ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ప్రతి నెలా అతడికి రూ.లక్ష వేతనంగా ఇచ్చేవాడు. అల్తాఫ్‌ అనే మరో వ్యక్తితో ఒకటిరెండుసార్లు టోనీ ముఖాముఖి మాట్లాడినట్టు తెలుస్తోంది. విచారణలో ఎలాంటి అంశాలు బయటకు రానున్నాయో చూడాలి.