Chennai Drugs : చెన్నైలో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ డీలర్ ఆత్మహత్య

చెన్నైలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 50 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ కంట్రల్ బ్యూరో అధికారులు ఓ డ్రగ్ డీలర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ సమయంలో చెన్నై అయ్యపక్కంలోని సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యారో యూనిట్ ఆఫీస్ మూడో అంతస్తు పైనుంచి దూకి నిందితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Chennai Drugs : చెన్నైలో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ డీలర్ ఆత్మహత్య

Chennai Drugs : చెన్నైలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 50 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ కంట్రల్ బ్యూరో అధికారులు ఓ డ్రగ్ డీలర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ సమయంలో చెన్నై అయ్యపక్కంలోని సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యారో యూనిట్ ఆఫీస్ మూడో అంతస్తు పైనుంచి దూకి నిందితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

తమిళనాడు వ్యాప్తంగా ఆపరేషన్ డ్రగ్స్ పేరుతో పోలీసులు యాంటీ నార్కోటిక్ ఆపరేషన్లు చేపడుతున్నారు. గంజాయితో పాటు డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న చెన్నైలోని చోళవరంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో డ్రగ్స్ కలిగున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు 50 కేజీల యాంఫెటమైన్ (amphetamine) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని డ్రగ్స్ డీలర్ గా గుర్తించిన పోలీసులు.. అతడిని చెన్నై అయ్యపక్కంలోని సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ కార్యాలయంలో ఉంచి విచారించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ విచారణలో షాకింగ్ సమాచారం వెల్లడైంది. సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూనే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి విక్రయించే వాడని తేలింది. దీంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అతడు చెన్నై సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ ఆఫీస్ లోని మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డ నిందితుడు.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణకు భయపడి, అసలు విషయం తన కుటుంబసభ్యులకు తెలుస్తుందనే భయంతోనే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగి, నిందితుడిని హైదరాబాద్ కు చెందిన రాయప్పరాజుగా పోలీసులు గుర్తించారు.