Prakasam District : గంధం చెట్ల మధ్య మత్తు మందుల తయారీ

ప్రకాశం జిల్లాలో మత్తు మందుల తయారీ కలకలం రేపింది. శ్రీగంధం తొటల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న మత్తు మందుల యూనిట్ పై గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 20 కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

Prakasam District : గంధం చెట్ల మధ్య మత్తు మందుల తయారీ

Prakasam District Drugs Manufacturing

Prakasam District : ప్రకాశం జిల్లాలో మత్తు మందుల తయారీ కలకలం రేపింది. త్ర్రిపురాంతంకం మండలం కే. అన్న సముద్రంలో శ్రీగంధం తొటల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న మత్తు మందుల యూనిట్ పై గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 20 కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 67 లక్షలు ఉంటంది.  దాడి సందర్భంగా ఒకవ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా తయారీ దారుడు గోవింద రెడ్డి పరారీలో ఉన్నాడు.

ఇక్కడ తయారు చేసిన మత్తుమందులను ఎక్కడెక్కడకు సరఫరా చేస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిని ఎక్కువగా తెలంగాణలోని వివిధ కళాశాలలకు, కల్లు తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

తెలంగాణలోని కాలేజీ వద్ద మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కూపీలాగటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. తెలంగాణకు చెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి త్రిపురాంతకంలో 17 ఎకరాల పొలం కొని అందులో 7 ఎకరాల్లో శ్రీగంధం చెట్లు, 9 ఎకరాల్లో బత్తాయితోట, 1 ఎకరంలో చేపల చెరువు నిర్వహిస్తూ వీటి మధ్యలో రేకుల షెడ్ నిర్మించి  దానిలో నిషేధిత మత్తు పదార్ధాలు తయారు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు.

తెలంగాణ  పోలీసుల సమచారంతో  ప్రకాశం, గుంటూరు జిల్లా  పోలీసులు ఎస్ఈబీ అధికారులు దాడి చేసి మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకుని కాపలా దారు వీరంకి సురేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు.  మత్తుపదార్ధాల తయారీదారు గోవిందరెడ్డి గతంలోనూ హైదరాబాద్ సమీపంలోని రామచంద్రాపురంలో ఇలాంటి యూనిట్ నిర్వహిస్తూ పోలీలకు చిక్కాడు.  దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో 17 ఎకరాల పొలం కొని దాని చెట్ల మధ్యలో ఈ మత్తు పదార్ధాలు తయారుచేస్తున్నాడు.  గోవిందరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.