డోస్ ఎక్కువయ్యింది : డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి 

  • Edited By: chvmurthy , May 11, 2019 / 05:36 AM IST
డోస్ ఎక్కువయ్యింది : డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి 

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతూనే ఉంది. పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి డ్రగ్స్ రాకెట్ ముఠాలను అరెస్టు చేస్తున్నప్పటికీ, యూత్ వాటిని వాడకుండా నిరోధించలేకపోతున్నారు. తాజాగా డ్రగ్స్ ఓవర్ డోస్ కావటంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. రాజేంద్రనగర్ లోని శివరాంపల్లిలో వాటర్ ప్లాంట్ నిర్వహించే శివకుమార్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు పండు (19) ఇంటర్ 2వ సంవత్సరం చదువు మధ్యలో మానేసి తండ్రి వాటర్ ప్లాంట్ లోనే చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

ఇటీవల కొంత కాలంగా గంజాయి. డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు.  శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకుని, ఓవర్ డోస్ అవటంతో మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.