విటమిన్ టాబ్లెట్స్ కాదు డ్రగ్స్ : చెన్నై ఎయిర్ పోర్టులో కలకలం 

చెన్నై విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు బయట పడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు.

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 05:59 AM IST
విటమిన్ టాబ్లెట్స్ కాదు డ్రగ్స్ : చెన్నై ఎయిర్ పోర్టులో కలకలం 

చెన్నై విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు బయట పడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు.

చెన్నై ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. భారీగా మత్తు పదార్ధాలు పట్టుబడ్డాయి. చెన్నై నుంచి అమెరికాకు ఎయిర్ కొరియర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న లక్షా 37వేల మత్తు టాబ్లెట్స్ ను అధికారులు సీజ్ చేశారు. విటమిన్ టాబ్లెట్స్ పేరుతో తప్పుడు పత్రాలతో మత్తు పదార్ధాలను తరలిస్తున్న ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధాల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మత్తు టాబ్లెబ్స్ కార్గో ఎయిర్ లైన్స్ ద్వారా బుక్ చేశారు. చెన్నై నుంచి అమెరికాకు పంపించాల్సి వుంది. కొరియర్ ద్వారా వీటిని బుక్ చేస్తున్నారు. కార్గోలో వస్తువులను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా టాబ్లెల్స్ పై కన్ను పడింది. టాబ్లెట్స్ ను ఓపెన్ చేసి షాక్ అయ్యారు. టాబ్లెట్స్ లో మత్తు గుణాలున్నట్లు కనుగొన్నారు. వీటిని చెన్నై నుంచి అమెరికాకు కొరియర్ చేయాలని ప్లాన్ వేశారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన డీఆర్ఐ అధికారులు..ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన లక్షా 37 వేల మత్తు టాబ్లెబ్స్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. దీనికి వెనుక డ్రగ్ మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.