Navy Employee : తాగిన మత్తులో సహోద్యోగి భార్యపై అత్యాచారం చేసిన నేవీ ఉద్యోగి

ముంబైలోని ఓ షేర్డ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే నేవీ ఉద్యోగి ఉళ్లో లేని సమయంలో, సహోద్యోగి అతని భార్యపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Navy Employee : తాగిన మత్తులో సహోద్యోగి భార్యపై అత్యాచారం చేసిన నేవీ ఉద్యోగి

Navy Employee Rapes

Navy Employee : ముంబైలోని ఓ షేర్డ్  అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే నేవీ ఉద్యోగి ఉళ్లో లేని సమయంలో, సహోద్యోగి అతని భార్యపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గతనెలలో మహిళ భర్త ఇంట్లోలేని సమయంలో సంఘటన జరగ్గా… మే 17న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

నేవీలో పనిచేసే బాధిత మహిళ భర్త, సహోద్యోగి అయిన నిందితుడు కలిసి గతేడాది ముంబైలోని కొలాబా ప్రాంతంలో అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారు. నిందితుడికింకా పెళ్లి కాలేదు.  ఏప్రిల్ నెలలో మహిళ భర్త ట్రైనింగ్ నిమిత్తం కేరళ వెళ్లాడు. ఏప్రిల్ 29న నిందితుడికి ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చింది. ఆ సంతోషంలో నిందితుడు బాధిత మహిళకు తనకు దుబాయ్ నుంచి వచ్చిన చాక్లెట్ల్ ఇచ్చాడు.  అనంతరం అతను మద్యం సేవించి పడుకున్నాడు. మహిళ తలకాయనొప్పిగా ఉందని చెప్పి తన గదిలోకి వెళ్లి టాబ్లెట్ వేసుకుని పడుకుంది.

కొద్ది సేపటి తర్వాత నిందుతుడు బాధితురాలి గదికి వచ్చి ఆమె తలకు మసాజ్ చేస్తానని చెప్పి అడిగాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో అతడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెపుతానని బెదిరించింది.  నిన్ను చంపి నేను చచ్చిపోతానని నిందితుడు బెదిరించాడు. అయినానిందితుడు ఆమెపై అత్యాచారం చేయబోగా , ఆమె చేతి మణికట్టుకోసుకుని గాయపరుచుకుంది. దీంతో నిందితుడు ఆమె గదినుంచి బయటకు వెళ్లిపోయాడు.

బాధిత మహిళ ధైర్యం కూడగట్టుకుని కేరళలో ఉన్న తన భర్తకు విషయం వివరించింది. గతవారం ఆమె భర్త కేరళ నుంచి ముంబై తిరిగి వచ్చి నేవీ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అనంతరం కఫ్ పరేడ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.