Durantho Express : భీమడోలు రైల్వే గేటు వద్ద ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్

ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున దురంతో ఎక్స్ ప్రెస్ రైలు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జు అయింది.

Durantho Express : భీమడోలు రైల్వే గేటు వద్ద ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్

Durantho Express

Durantho Express : ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున దురంతో ఎక్స్ ప్రెస్ రైలు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. అదుపు తప్పి బొలెరో వాహనం రైలు గేట్ ను ఢీకొని ట్రాక్ పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రైలు రావడంతో వాహనం వదిలి ప్రయాణికులు పరారయ్యారు. రైలు పట్టాలపైకి దూసుకొచ్చిన బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది.

వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత దురంతో ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. అయితే ప్రమాదానికి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద చేరుకుంటోంది.

Duronto Express Catches Fire : దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

అయితే రైలు వస్తున్న సమయంలో బొలెరో వాహనం గేటును ఢీకొని రైలు పట్టాలపైకి దూసుకొచ్చి ఆగిపోయింది. దీంతో దురంతో ఎక్స్ ప్రెస్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అయింది. అయితే వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా, రైలు పట్టాలపై వాహనం నిలిచిపోవడంతో వాహనాన్ని విడిచిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు.

అయితే వాహనాన్ని ఢీకొన్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు అక్కడే నిలిచిపోయింది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అయింది. రైలు మందు భాగంలో బొలెరో వాహనం విడి భాగాలు ఇరుక్కుపోవడంతో రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. దాదాపు 4 గంటలపాటు దురంత్ ఎక్స్ ప్రెస్ భీమడోలులోనే నిలిచిపోయింది.