Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.. అరెస్టుల పరంపరను కొనసాగిస్తోంది. ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈరోజు చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని అరెస్ట్ చేశారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని అరెస్ట్ చేసిన ఈడీ

ED arrests Chariot Production Media owner Rajesh Joshi In Delhi Liquor Scam

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు మామూలుగా లేదు. అరెస్టుల పరంపరను కొనసాగిస్తోంది. కేవలం దాదాపు 24 గంటల్లోనే ముగ్గురుని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. బుధవారం (ఫిబ్రవరి 8,2023) ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈరోజు చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ తరపున రూ.31 కోట్లు బదిలి చేసిన రాజేశ్ జోషిని అరెస్ట్ చేసింది ఈడీ. దినేశ్ అరోరాకు రాజేశ్ జోషి ఈ మొత్తాన్ని అందజేసినట్లుగా ఈడీ వెల్లడించింది. ఈ మొత్తంలో కొంత భాగాన్నీ ఆప్ గోవా ఎన్నికలకు ఖర్చు చేసినట్లుగా చార్జ్ షీటులో ఈడీ పేర్కొంది. రాజేశ్ జోషిని అరెస్ట్ చేసిన ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి తిరిగి కష్టడీకి కోరే అకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రా అరెస్ట్

ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు సీబీఐ పలువుని అరెస్ట్ చేసి విచారణ చేసింది. చార్జ్ షీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేయగా కొన్నిగంటల్లోనే శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు,ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇలా వరుస అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం ఇంకెక్కడకి దారి తీయనుందో..ఇంకా ఎంతమంది అరెస్ట్ కానున్నారో వేచి చూడాలి.