Karvy Scam : మనీ ల్యాండరింగ్ కేసులో కార్వీకి చెందిన రూ.110 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు చెందిన రూ. 110 కోట్ల విలువైన వివిధ రకాలైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం అటాచ్ చేసింది. వీటిలో భూములు, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయి.

Karvy Scam : మనీ ల్యాండరింగ్ కేసులో కార్వీకి చెందిన రూ.110 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
ad

Karvy Scam :  మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు చెందిన రూ. 110 కోట్ల విలువైన వివిధ రకాలైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం అటాచ్ చేసింది. వీటిలో భూములు, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయి.

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ తో పాటు దాని సీఎండీ పార్ధ‌సార‌ధి ఇత‌రుల‌పై మ‌నీల్యాండ‌రింగ్ నియంత్ర‌ణ చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు న‌మోదు చేసింది. ఇదే కేసులో ఈడీ గ‌తంలో రూ.1984 కోట్ల విలువైన ఆస్తుల‌ను అటాచ్ చేసింది. ఈడీ ఇప్ప‌టికే కంపెనీ సీఎండీ సీ. పార్ధ‌సార‌ధి, గ్రూప్ సీఎఫ్ఓ జీ హ‌రికృష్ణను జనవరిలో అరెస్ట్ చేయ‌గా వారు ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు.

క్ల‌యింట్ల షేర్ల‌ను అక్ర‌మంగా త‌న‌ఖా పెట్టి కార్వీ గ్రూపు రూ 2,800 కోట్ల రుణాల‌ను పొందింద‌ని  బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈడీ వాటి ఆధారంగా ద‌ర్యాప్తు చేప‌ట్టింది. రియల్ ఎస్టేట్ వెంచర్లకోసం ఏర్పాటు చేసిన రెండు కంపెనీలకు ఈ రుణాలను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

ఎన్ఎస్ఈ, సెబీ ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా క్ల‌యింట్ సెక్యూరిటీల‌ను విడుద‌ల చేసిన అనంత‌రం ఈ రుణాలు నిర‌ర్ధ‌క ఆస్తులుగా (ఎన్‌పీఏ) పేరుకు పోయాయి. ఈ నిధ‌ుల‌ను కంపెనీ అనుబంధ సంస్ధ‌ల‌కు మ‌ళ్లించింద‌ని ఈడీ పేర్కొంది. తాజా ఉత్తర్వులతో ఈకేసులో ఈడీ ఎటాచ్ మెంట్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.2,905 కోట్లకు చేరింది. కాగా…కార్వీ గ్రూప్‌కు చెందిన సీనియర్ అధికారి, కార్వీ డేటా మేనేజ్ మెంట్ సర్వీస్‌కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్, సీఎండీ పార్ధసారధికి సన్నిహితుడు అయిన వి, మహేష్ మనీలాండరింగ్ కార్యకలాపాలు అమలు చేయటంలో చురుకుగా వ్యవహరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

Also Read : Extra Marital Affair : సచివాలయ ఉద్యోగి రాసలీలలు-రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య