Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా సెక్రటరీకి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి వరుసుగా నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా మనీశ్ సిసోడియా సెక్రటరీ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. మార్చి21న విచారణకు రావాలని అరవింద్ కుమార్ ను ఈడీ ఆదేశించింది.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి వరుసుగా నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా మనీశ్ సిసోడియా సెక్రటరీ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. మార్చి21న విచారణకు రావాలని అరవింద్ కుమార్ ను ఈడీ ఆదేశించింది. మార్చి18న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఈడీ విచారించనుంది. అరుణ్ పిళ్లై, మాగుంట శ్రీనివాసుల రెడ్డిలను కలిసి ఈడీ ప్రశ్నించనుంది. అలాగే మార్చి20న రాహుల్ సింగ్, అమిత్ అరోరా, ఎమ్మెల్సీ కవిత విచారణ ఉంటుంది. ఆ రోజు కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించనున్నారు.
సుమారు ఏడు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఉంది. సీబీఐ ఎఫ్ ఐఆర్ ఆధారంగా గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా ఈడీ విచారించే దిశగా నోటీసులు జారీ చేసింది. మనీశ్ సిసోడియాను ఇప్పటికే అరెస్టు చేశారు. అయన కస్టడీని సైతం పొడిగించారు. కీలక నిందితులను విచారణ చేయడానికి మనీశ్ సిసోడియాతో కలిపి కొంతమంది అధికారులను, మనీశ్ సిసోడియా కార్యదర్శిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగానే సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక వ్యక్తులకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.
Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
మార్చి18న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సౌత్ గ్రూప్ లో చాలా కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. మాగుంటకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. శనివారం అరుణ్ పిళ్లై, మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కలిపి ప్రశ్నించబోతున్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ మాజీ కమిషనర్ రాహుల్ సింగ్, లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మార్చి20న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా మార్చి21న విచారణకు రావాలని మనీశ్ సిసోడియా సెక్రటరీ అరవిద్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీశ్ సిసోడియాతో కలిపి రాహుల్ సింగ్, అమిత్ అరోరా, అరవింద్ కుమార్ ను విచారించబోతున్నారు. వీరి నుంచి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు.
మనీశ్ సిసోడియా కేసుకు సంబంధించి ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు డీలర్ కమీషన్ ను ఐదు నుంచి 12 శాతానికి పెంచారు? జీవోఎం సమావేశంలో అసలు ఈ కమీషన్ కు సంబంధించి ఓబెరాయ్ హోటల్ లో సౌత్ గ్రూప్ సమావేశమై తమకు అనుకూలంగా పాలసీని రూపొందించాలని సిసోడియాను కోరడం, దానికనుగుణంగా సిసోడియా కమీషన్ లో మార్పులు చేయడం ఇవన్నీ జరిగాయని, ఆధారాలను నాశనం చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఎల్ జీ కోరిన తర్వాతనే మొబైల్ ఫోన్ ఎవిడెన్స్ అన్ని కూడా డెస్ట్రాయ్ అయ్యాయని కూడా సిసోడియా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చాలా కీలక నేతలు ఈ కేసు దర్యాప్తులో ఉన్నట్లు చెప్పవచ్చు.