ED Seizes Gold: వామ్మో అంత బంగారమా! ప్రైవేట్ లాకర్ల నుంచి 91 కేజీల బంగారం సీజ్ చేసిన ఈడీ

ఒక బులియన్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు లాకర్లపై ఈడీ జరిపిన దాడిలో 91.5 కేజీల బంగారం బయటపడింది. మరో 340 కేజీల వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం, వెండి విలువ దాదాపు రూ.47 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.

ED Seizes Gold: వామ్మో అంత బంగారమా! ప్రైవేట్ లాకర్ల నుంచి 91 కేజీల బంగారం సీజ్ చేసిన ఈడీ

ED Seizes Gold: వివిధ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) వరుసగా దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేక కేసుల్లో గుట్టలకొద్దీ నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్న ఈడీ బుధవారం జరిపిన దాడుల్లో భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకుంది.

Mysterious Sounds: భూగర్భం నుంచి వస్తున్న వింత శబ్దాలు.. భయాందోళనలో గ్రామస్తులు

ఒక ప్రైవేటు లాకర్ నుంచి ఏకంగా 91.5 కేజీల బంగారం, 340 కేజీల వెండిని స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం బంగారం, వెండి విలువ దాదాపు రూ.47 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఒక బులియన్ కంపెనీ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముంబైలో ఆ కంపెనీకి చెందిన 761 ప్రైవేటు లాకర్ల నుంచి 91.5 కేజీల బంగారం, 152 కేజీల వెండిని స్వాధీనం చేసుకుంది. మరో చోట జరిపిన దాడిలో 188 కేజీల వెండిని స్వాధీనం చేసుకుంది. పరేఖ్ అల్యుమినెక్స్ లిమిటెడ్ సంస్థలో జరిగిన అవకతవకల విషయంలో రక్ష బులియన్ అనే కంపెనీతోపాటు, క్లాసిక్ మార్బుల్స్ అనే సంస్థ కార్యాలయాలపై ఈడీ తాజా దాడులు నిర్వహించింది.

Sourav Ganguly, Jay Shah: జై షా, సౌరవ్ గంగూలీకి సుప్రీంకోర్టు ఊరట.. పదవుల్లో తిరిగి కొనసాగేలా తీర్పు

ఈ సంస్థలు 2018 నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించి రూ.2,296 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సంస్థ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రశీదులు, రిజిష్టర్లు వంటివి లేవని ఈడీ అధికారులు చెప్పారు.