Hyderabad : హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఉద్యోగుల మందు పార్టీ.. ముక్క, సుక్కతో మస్త్ ఎంజాయ్

వాల్యూయేషన్ అధికారి సురేందర్ గౌడ్ ఉద్యోగులకు ఏకంగా సర్కిల్ కార్యాలయంలోనే ముందు పార్టీ ఇచ్చాడు. తన కింది స్థాయి ఉద్యోగులకు మందు పార్టీ ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

Hyderabad : హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఉద్యోగుల మందు పార్టీ.. ముక్క, సుక్కతో మస్త్ ఎంజాయ్

Liquor party

Hyderabad : హైదరాబాద్ లోని కాప్రా సర్కిల్ కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. మందు బాబులకు పార్టీ ప్లేస్ గా మారింది. నిత్యం ఇక్కడ మందు పార్టీలు జరుగుతున్నాయి. ఏకంగా అందులో పని చేసే అధికారులు, ఉద్యోగులే మందు పార్టీలు చేసుకుంటున్నారు. ముక్క, సుక్కతో నిత్యం పార్టీలు జరుుకుంటున్నారు.

వాల్యూయేషన్ అధికారి సురేందర్ గౌడ్ ఉద్యోగులకు ఏకంగా సర్కిల్ కార్యాలయంలోనే ముందు పార్టీ ఇచ్చాడు. సురేందర్ గౌడ్ తన కింది స్థాయి ఉద్యోగులకు మందు పార్టీ ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కింది స్థాయి ఉద్యోగులకు ముక్క, సుక్క సరఫరా చేశారు. మద్యం సేవిస్తూ అధికారులు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు.

Mylavaram Agricultural Market : వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

రాత్రి కాప్రా సర్కిల్ ఆఫీస్ లోనే మందు పార్టీ చేసుకున్నారు. ముక్క, సుక్కతో మస్త్ ఎంజాయ్ చేశారు. ఎవరు చూడరన్న ధైర్యమో, ఏమీ చేయలేరన్న భరోసానో ఏమో మద్యం సేవిస్తూ మస్త్ ఎంజాయ్ చేశారు. ఏం జరుగుతుందని నిలదీస్తే అక్కడి నుంచి జారుకున్నారు. ఉద్యోగుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.