పనిమనిషిపై రెండు వారాలుగా అత్యాచారం చేస్తున్న సినీ రంగానికి చెందిన వ్యక్తి

పనిమనిషిపై రెండు వారాలుగా అత్యాచారం చేస్తున్న సినీ రంగానికి చెందిన వ్యక్తి

employer raped woman in banjara hills police station area : ఇంట్లో పని చేయించుకోటానికి  మనిషిని నియమించుకుని ఆమై పై రెండువారాలుగా అత్యాచారం చేస్తున్న సినీరంగానికి చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని  ఫిల్మ్ నగర్ లో నివసించే ఉదయభాను (52) అనే వ్యాపారి సినీ రంగంలో పని చేస్తుంటాడు. ఉదయభాను ఇంట్లో పని చేయటానికి ఫిబ్రవరి 17న రాజమండ్రి నుంచి ఒక మహిళను పిలిపించుకుని ఆమెను పనిలో పెట్టుకున్నాడు. ఆమె ఉండటానికి…. అతను నివసించే అపార్ట్ మెంట్ లోనే ఒక చిన్న గదిని కేటాయించాడు.

ఫిబ్రవరి 18న మహిళ అతని ఇంట్లో పని చేస్తుండగా, బలవంతంగా ఆమెను తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ విషయం బయటకు చెపితే నిన్ను, నీ కూతుర్ని చంపేస్తానని బెదిరించాడు.

ఆమె అత్యాచారం జరుగుతున్న విషయం ఎవరికీ చెప్పకుండా సెల్ ఫోన్ లాక్కుని తన వద్ద పెట్టుకున్నాడు. అప్పటి నుంచి రోజూ  ఆమెపై అత్యాచారం చేస్తూ గదిలో నుంచి బయటకు రాకుండా.. బయట గడియ పెట్టి …బయటకు వెళ్లేప్పుడు బయట తాళం పెట్టుకుని వెళ్లటం మొదలెట్టాడు.

అది భరిస్తూన్న  ఆమె ఈనెల 5న  ఉదయభాను బయటకు వెళుతున్నప్పడు చాకచక్యంగా తన సెల్ ఫోన్ ను తీసుకుని జాగ్రత్త చేసుకుంది.  ఉదయభాను వెళ్లిపోగానే తన కూతురుకి ఫోన్ చేసి గత రెండువారాలుగా తాను పడుతున్న బాధను చెప్పుకుంది.

తల్లి పరిస్ధితిని  తెలుసుకున్న కుమార్తె ఆందోళనతో 100 కి ఫోన్ చేసి చెప్పింది.  వెంటనే పోలీసులు ఆ మహిళ సెల్ పోన్ సిగ్నల్స్ ఆధారంగా ఫిలింనగర్ లోని ఆపార్ట్మెంట్ ను గుర్తించారు.  శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎస్సై రాంబాబు నేతృత్వంలోని సిబ్బంది అపార్ట్ మెంట్ లోకి వెళ్లి ఫ్లాట్ లో బంధించిన మహిళకు విముక్తి కలిగించారు.

 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయభాను పై ఐపీసీ సెక్షన్ 342, 376(2), 323, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాధితురాలిని పోలీసులు విడిపించి తీసుకువెళ్లారని తెలిసిన నిందితుడు పరారీఅయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.