Ex-Bihar MLA: 24 ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్టు

బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాదాపు 24 ఏళ్ళుగా తప్పించుకు తిరిగాడు. రంజన్ తివారీని తాజాగా భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలోని రక్సౌల్ (బిహార్)లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1998లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు నమోదైన అనంతరం నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.

Ex-Bihar MLA: 24 ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్టు

Ex-Bihar MLA

Ex-Bihar MLA: బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాదాపు 24 ఏళ్ళుగా తప్పించుకు తిరిగాడు. రంజన్ తివారీని తాజాగా భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలోని రక్సౌల్ (బిహార్)లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1998లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు నమోదైన అనంతరం నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.

అతడి గురించి ఆచూకీ చెబితే 25 వేల రూపాయలు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. బిహార్ పోలీసుల సాయంతో అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిహార్ లో అతడిపై కేసులు ఏమైనా నమోదయ్యాయా? అన్న అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రంజన్ తివారీ రక్సౌల్ మీదుగా కాఠ్మాండు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నాడని, ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారని అధికారులు వివరించారు.

Sri Krishna Janmashtami : కిట్టయ్య ఆకలికి ఆగలేడు..! రోజుకు 10 సార్లు నైవేద్యం పెట్టే 1500ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీకృష్ణుడి ఆలయం విశేషాలు