ఎక్సైజ్ పోలీసు అసభ్య ప్రవర్తన : చితకబాదిన మహిళలు

మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఓ యువతి పట్ల ఎక్సైజ్ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించారు. గమనించిన ఇద్దరు మహిళలు సదరు పోలీసుపై దాడి చేశారు.

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 01:18 PM IST
ఎక్సైజ్ పోలీసు అసభ్య ప్రవర్తన : చితకబాదిన మహిళలు

మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఓ యువతి పట్ల ఎక్సైజ్ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించారు. గమనించిన ఇద్దరు మహిళలు సదరు పోలీసుపై దాడి చేశారు.

మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఓ యువతి పట్ల ఎక్సైజ్ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని మహేశ్వర్ లోని కొన్ని నివాసాల్లో శుక్రవారం సబ్ ఇన్ స్పెక్టర్ మోహన్ లాల్ భయాల్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో ఉన్న యువతి పట్ల సబ్ ఇన్ స్పెక్టర్ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు.

అయితే ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు మహిళలు సదరు పోలీసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఇన్ స్పెక్టర్ పై ఆ ఇద్దరు మహిళలు దాడి చేశారు. అతని కాలర్ పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కర్రలతో చితకబాదారు. మిగతా పోలీసులు మహిళలను ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ ఘటనపై ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.