Facebook Friend Loot A House : మొదటిసారి దొంగతనం…చేసిన పాపం పోవటానికి దేవుడికి పూజలు చేసిన దొంగలు

డిగ్రీ చదువుకునే విద్యార్ధులు  మొదటి సారి దొంగతనం చేశారు. ఆ తర్వాత అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. చేసిన పాపం పోవటానికి ఆడబ్బుతో దేవుడికి పూజలు చేయించి  దానధర్మాలు చేసిన ఉదంతం మధ్య

Facebook Friend Loot A House : మొదటిసారి దొంగతనం…చేసిన పాపం పోవటానికి దేవుడికి పూజలు చేసిన దొంగలు

Face Book Friend

Facebook Friend Loot A House :  డిగ్రీ చదువుకునే విద్యార్ధులు  మొదటి సారి దొంగతనం చేశారు. ఆ తర్వాత అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. చేసిన పాపం పోవటానికి ఆ డబ్బుతో దేవుడికి పూజలు చేయించి  దానధర్మాలు చేసిన ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మోను గోస్వామి అనే యువకుడికి ఫేస్ బుక్ ద్వారా ఒక యువతి (16) పరిచయం అయ్యింది.  ఆమె జనక్ గంజ్ న్యూ శాంతి నగర్ లో టీచర్ గా  పదవీ విరమణ చేసి ఒంటరిగా ఉన్న ప్రతిభా భట్నాగర్(70) అనే వృధ్ధురాలి ఇంట్లో సహాయకురాలిగా తన తల్లితో కలిసి పని చేస్తున్నానని తెలిపింది. వారు కూడా అదే ఇంట్లో మేడ మీద ఉంటూ వృధ్దురాలిని కనిపెట్టుకుని ఉంటున్నామని తెలిపింది.

క్రమేపి వారి స్నేహం ప్రేమగా మారింది. ఈక్రమంలో యువకుడు ఆమెను కలవటానికి  ఇంటికి వెళ్లేవాడు. అలా వెళ్లినప్పుడు ఆ ఇంటి యజమానురాలైన  వృధ్దురాలిని  చూసేవాడు. ఆ వృద్దురాలి ఒంటిపై ఉన్న బంగారం చూశాడు. ఆమె ఇంట్లో భారీగా డబ్బు లభిస్తుందని ఆశ కలిగింది. ఆమెవద్ద ఇంకా బంగారం ఉంటుందని ఆశించాడు. అతనిలో దురాలోచన మొదలైంది.  డబ్బు కోసం దొంగతనం చేయాలని అనుకున్నాడు. ఈవిషయం తన స్నేహితుడికి చెప్పాడు.

Also Read : Young Girl Raped By Father : 17 ఏళ్ళ బాలికపై తండ్రితో సహా 28 మంది అత్యాచారం..

అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం సమయంలో బాలిక  తల్లి మార్కెట్ కు  వెళ్లిందని తెలుసుకున్నాడు. అదే సమయంలో బాలిక తన ఇంట్లో  అన్నం  తినటానికి వెళ్ళింది. గోస్వామి తన మిత్రుడు  సన్నీతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. వృధ్దురాలు ప్రతిభ మంచంమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది. యువకులిద్దరూ వృధ్దురాలి వద్దకు వచ్చి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి … చేతికున్న ఉంగరాలు, బంగారు గాజు తీసుకున్నారు.  నగదు కోసం వెతకగా రెండువేల రూపాయలు దొరికింది. అరిచి ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించి అవి తీసుకుని పారిపోయారు.

కొద్ది సేపటి తర్వాత ఆయువకుడి  ప్రియురాలు కిందకు దిగివచ్చింది. కొద్దిసేపట్లో మార్కెట్ కు వెళ్లిన ఆమె తల్లికూడా వచ్చింది. ప్రతిభ దొంగతనం  జరిగిన విషయాన్ని వారిద్దరికీ చెప్పింది.  దీంతో వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మొదట సీసీటీవీ పుటేజి పరీశిలించగా వృధ్ధురాలి ఇంటివైపు ఇద్దరు యువకులు రావటం గమనించారు. కొద్ది సేపటి తర్వాత వారిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లటం చూశారు.  అనంతరం వారిద్దరూ కలిసి ఒక ఆటో ఎక్కారు. పోలీసులు ఆటో డ్రైవర్ ను పట్టుకుని  యువకులను ఎక్కడ దింపాడో విచారించారు. హజీరా కూడలి వద్ద వారిద్దరినీ వదిలి వేసినట్లు పోలీసులకు చెప్పాడు ఆటోడ్రైవర్. హజీరా స్క్వేర్ నుంచి పోలీసులు సీసీటీవీ పుటేజి పరిశీలించగా వారిద్దరూ అక్కడి నుంచి ప్రసాద్ నగర్ చేరుకున్నట్లు తెలుసుకున్నారు.

Also Read : Extra Marital Affair : బీజేపీ కార్పోరేటర్ భర్త వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన తల్లి

చివరికి యువకులిద్దరూ మోను గోస్వామి, సన్నీ పాల్ అలియాస్ శుభమ్ అలియాస్ సన్నీ శాక్యగా గుర్తించారు. వారి ఇళ్లు కనుగొని ఇంట్లో విచారించగా…. తమ పిల్లలు ఉజ్జయిని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఉజ్జయిని నుంచి తిరిగి వచ్చేంతవరకు పోలీసులు వేచి ఉన్నారు. వారు తిరిగి రాగానే మంగళవారం ఉదయం వారిని అరెస్ట్ చేశారు.

పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించగా మొత్తం వివరించారు. ఇది తమ మొదటి దొంగతనం అని… దొంగతనం చేసిన తర్వాత ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. తప్పు చేశాము కాబట్టే ఆరోగ్యం బాగోలేదనే ఉద్దేశ్యంతో ఉజ్జయిని వెళ్లి మహాకాలేశ్వర్ కు క్షమాపణలు చెప్పాలనుకున్నామని అందుకే ఉజ్జయిని వెళ్లి పాప పరిహారార్ధం పూజలు చేయించుకుని…. దానధర్మాలు చేసి దేవుడికి క్షమాపణలు చెప్పుకుని వచ్చామని వివరించారు. కాగా ఇది వారికి మొదటి దోపిడీ అయినా ప్రోఫెషనల్స్ చేసినట్లు ఉందన్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసులో బాలికకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలిపారు.