నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : May 16, 2019 / 03:01 PM IST
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్

హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ఓవ్యక్తి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడు ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి  బెదిరింపులకు పాల్పడుతున్నాడని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడు కర్నాటి గురు వినోద్ కుమార్ స్వస్థలం కడప జిల్లా. 2017 లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాశాడు. ఆ పరీక్షల్లో  విజయం సాధించలేక పోవటంతో నకిలీ ఆఫీసర్ అవతారం ఎత్తాడని  సీపీ వివరించారు.   

నిందితుడి నుండి డమ్మీ పిస్టల్, నకిలీ ఐడి కార్డ్స్, నకిలీ రబ్బర్ స్టాంప్స్, ఎన్.ఐ.ఏ నకిలీ రబ్బర్ స్టాంప్స్, ఐ పాడ్, లాప్ టాప్స్, సెల్ ఫోన్స్, బైనాకులర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మీద గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. పోలీస్ ఆఫీసర్ కావాలనే మక్కువతో కోచింగ్ సెంటర్ లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడని అయినా పోలీస్ కావాలనే ఆశ నెరవేరకపోవడంతో నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడని సీపీ తెలిపారు. కేసు నమోదు చేసిన  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.