Fake notices: పోలీసుల పేరుతో బ్యాంకులకు ఫేక్ నోటీసులు

సామాన్యులను బురిడీ కొట్టించి అకౌంట్లలో ఉన్న నగదు మాయం చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు అలా కూడా కాదట.. నేరుగా బ్యాంకుకే ఫేక్ నోటీసులు పంపి ఖాతాల్లో ఉన్న అమౌంట్ లూటీ చేస్తున్నారు.

Fake notices: పోలీసుల పేరుతో బ్యాంకులకు ఫేక్ నోటీసులు

Fake Notices

Fake Notices: సామాన్యులను బురిడీ కొట్టించి అకౌంట్లలో ఉన్న నగదు మాయం చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు అలా కూడా కాదట.. నేరుగా బ్యాంకుకే ఫేక్ నోటీసులు పంపి ఖాతాల్లో ఉన్న అమౌంట్ లూటీ చేస్తున్నారు. అలా ఒక ఖాతా నుంచి రూ.కోటి కొట్టేసిన నేరస్థులు మరో 39 అకౌంట్లను కూడా లూటీ చేయాలనుకున్నారు. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు విషయం తెలియజేశారు.

కోల్‌కతాలో ఐసీఐసీఐ బ్యాంక్ లోని ఓ అకౌంట్ లో లోన్ అమౌంట్ క్షణాల్లో మాయమైంది. ఎలా అంటే సైబర్ నేరగాళ్లు ఎస్సై పేరుతో కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు ఫేక్ లెటర్ పంపించారు.

దీంతో నేరుగా ఎస్సై అని బ్యాంకు రావడంతో బ్యాంక్ అధికారులు చెక్ చేసుకోకుండా అకౌంట్ డీ ఫ్రీజ్ చేశారు. అలా అకౌంట్లో ఉన్న అమౌంట్ రూ.కోటికి పైగా మాయమైంది.

కొద్దిసేపటి తర్వాత సైబర్ నేరగాళ్లు 39 అకౌంట్స్ డీ ఫ్రీజ్ చేయాలంటూ మరో కొరియర్ పంపించారు. ఈ సారి అనుమానించిన బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిజాలు బయటపడ్డాయి. కోల్‍కతా బ్యాంకుకు తాను సైబర్ క్రైమ్ ఎస్సై అని చెప్పి అకౌంట్ డీ ఫ్రీజ్ చేయాలని లెటర్ ఇచ్చాడు.

పోలీసు అధికారి అనే నమ్మకంతో డీ ఫ్రీజ్ చేసేశారు. సులువుగా పనైపోతుందని భావించిన సైబర్ నేరగాళ్లు ఈ సారి కొరియర్ పంపించి మరో 39అకౌంట్లు డీ ఫ్రీజ్ చేయాలని చెప్పారు. ఇలా
లోన్ యాప్ బ్యాంక్ అకౌంట్‌లు అన్నింటినీ చైనాకు చెందిన సైబర్ నేరస్థులు మానిటర్ చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నట్లుగా తెలిసింది. టెక్నికల్ సపోర్ట్ పేరుతో ఇప్పటికే కొన్ని అకౌంట్లలో డబ్బు మాయమైంది. మిగిలిన వాటిని కూడా ఖాళీ చేయాలని ఫేక్ నోటీసులు పంపారు. ఈ లోన్ యాప్ కేసుల్లో ఫ్రీజ్ అయిన 11వందల అకౌంట్లలో 800వరకూ ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి.

ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్న చైనాకు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. త్వరలోనే నేరగాళ్లకు పట్టుకుంటాం. లోన్ యాప్ కేసుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై గత డిసెంబర్లో 28 కేసులు నమోదు చేశాం.

ఇప్పటి వరకూ అటువంటి 11 వందల అకౌంట్లను ఫ్రీజ్ చేయించాం.. అటువంటి నేరగాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ 10టీవీతో మాట్లాడుతూ అన్నారు.