Extra Marital Affair : ఒకడి వల్ల మోసపోయాను… నా జీవితాన్ని నాశనం చేశాడు…

వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పును భర్త క్షమించినా, ఏమైందో ఏమో ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

10TV Telugu News

Extra Marital Affair : వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పును భర్త క్షమించినా, ఏమైందో ఏమో ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి  జిల్లా మొగలికుదురు గ్రామానికి చెందిన కంచి సతీష్ (32) కంచి సంధ్య (22) తమ పిల్లలు జశ్వన్(4) ఇందుశ్రీ దుర్గ (2)లతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇందుశ్రీదుర్గ, సతీష్  మృతదేహాలు ఆదివారం లభించగా… తల్లి, కుమారుడి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన  సంధ్యకు తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ తో ఆరేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఒక కొడుకు కూతురు పుట్టారు.  తాపీ పని చేసుకునే సతీష్   రెండేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. ఈ సమయంలో  భర్తలేకుండా ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్న సంధ్యకు  కేశవదాసుపాలెనికి  చెందిన ఫణీంద్రతో  పరిచయం అయ్యింది.  క్రమేపి వారి స్నేహం వివాహేతర బంధానికి  దారి తీసింది.

ఈ పరిచయంలో ఫణీంద్ర  సంధ్యనుంచి కొంత బంగారం, నగదు తీసుకున్నాడు. వీరిద్దరి వివాహేతర సంబంధం బయటపడటం, డబ్బు నగదు తీసుకున్నాడని తెలియడంతో పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. కొంత బంగారం, నగదు ఫణీంద్ర వెనక్కు ఇచ్చేశాడు. వీరి అక్రమ సంబంధం బయటపడటంతో ఆమె మామ,  మనవళ్లను  తన తన దగ్గర ఉంచుకుని సంధ్యను పుట్టింటికి పంపించివేశాడు.

ఇదిలా ఉండగా జులై 20న గల్ఫ్ నుంచి వచ్చిన సతీష్‌కు   భార్య వివాహేతర సంబంధం  తెలియటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు.  భార్య చేసిన   పనికి మద్యానికి బానిసయ్యాడు.  24 గంటలు  తాగుతూ ఉండటంతో…మార్పు వస్తుందని ఆశించి తల్లితండ్రులు సతీష్ ను కేశవదాసుపాలెంలో ఉన్న పెద్దఅక్క ఇంటికి పంపించారు.

అక్కడినుంచి సతీష్ జులై 29 గురువారం నాడు  భార్యకు ఫోన్ చేశాడు. పాలకొల్లు మండలం వెలివెలలో  ఉన్న తన పెద్దమ్మ నాగలక్ష్మి ఇంటివద్ద  ఉన్నానని చెప్పటంతో   పిల్లల్ని తీసుకుని అక్కడకు వెళ్లాడు.  జరిగిన సంగతి మర్చిపోయి కలిసి బతుకుదామని చెప్పడంతో   సంధ్య కూడా ఒప్పుకుంది.

శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో  కుటంబం మొత్తం మొగలికుదురుకు  బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమో  చించినాడ వంతెన వద్ద బైక్  పెట్టి  గోదావరిలోకి దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సంధ్య తన తండ్రికి వాయిస్ మెసేజ్ చేసింది.  ‘డాడీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నా జీవితాన్ని నాశనం చేశాడు.. ఫలితంగా నేను, నా భర్త, పిల్లలు ఇద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ అని చెప్పి వాయిస్ మెసేజ్ చేసింది.

సంధ్య వాయిస్ మెసేజ్ ను బట్టి చూస్తే ఒంటరిగా ఉన్న సంధ్యను ఫణీంద్రే  ట్రాప్ చేసి లోబరుచుకున్నట్లు అనుమానం కలుగుతోంది. ఫణీంద్ర వాళ్ల కుటుంబ సభ్యుల కారణంగానే  తామంతా అత్మహత్యచేసుకుని చనిపోతున్నట్లు సంధ్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోనూ   ఫణీంద్ర వల్ల సంధ్య ఎలా మోసపోయిందో మరింత వివరంగా రాసింది.

‘మా నలుగురి చావుకు కారణం ఫణీంద్ర, వాళ్ల అక్క, బావ, వాళ్ల అమ్మా నాన్న.. అతను నన్ను రోజూ చీట్‌ చేసేవాడు. నాకు తెలియకుండా టాబ్లెట్‌లు ఇచ్చేవాడు. నా డబ్బులు, బంగారం దొంగతనంగా తీసుకెళ్లిపోయాడు. అది విని మా ఆయన తట్టుకోలేకపోయాడు. మొత్తం నా కాపురాన్ని నాశనం చేశారు. నా డబ్బు, బంగారంపై ఆశపడే ఇదంతా చేశారు. మా నలుగురి జీవితాలను నాశనం చేశారు’ అంటూ తన సూసైడ్ నోట్ లో పేర్కోంది. సంధ్య సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10TV Telugu News