Kurnool : దారుణం.. పెళ్లి చేసుకుందని కూతురిపై కత్తితో తండ్రి దాడి

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్టబాగంపై గాయాలయ్యా

Kurnool : దారుణం.. పెళ్లి చేసుకుందని కూతురిపై కత్తితో తండ్రి దాడి

Kurnool

Kurnool : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్టబాగంపై గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Bhubaneswar : అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతుంది..ఛాటింగ్ చేస్తుంది, తర్వాత…

నంద్యాలకు చెందిన మళ్లీశ్వరి తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మాట్లాడదాం అని కూతురిని ఇంటికి పిలిచిన తండ్రి.. అనూహ్యంగా కత్తితో దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Social Media : ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు

పరువు, ప్రతిష్ట పేరుతో కొందరు తల్లిదండ్రులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల ఇష్టాలు తెలుసుకోవడం లేదు. కులం, మతం అంటూ రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఇష్టం లేని వారిని వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. క్షణికావేశంలో ఘోరాలకు తెగబడుతున్నారు. కన్నబిడ్డలు అని కూడా చూడటం లేదు. పరువు పోయిందనే అనే ఆవేశంతో కన్నవారిని సైతం కడతేరుస్తున్నారు.