కన్నతండ్రి కాదు కామాంధుడు : కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం

  • Edited By: veegamteam , September 19, 2019 / 06:57 AM IST
కన్నతండ్రి కాదు కామాంధుడు : కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం

అమ్మ కడుపునుంచే ఆడపుట్టకపై అంతులేని హింసలు కొనసాగుతున్నాయి. నెలల చిన్నారి నుంచి కాటికి వెళ్లే వృద్ధురాళ్లపై కూడా ఈ అరాచకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కన్న తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా జరగుతున్న ఈ దారుణాలపై ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. 

తొర్రూరు కేఎన్ ఎన్ రెడ్డి కాలనీకి చెందిన కుమార స్వామి తొమ్మిదవ తరగతి చదువుతున్న కన్న కుమార్తెపై గత మూడు నెలల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బైటకు చెబితే చంపేస్తానంటు బెదిరించాడు. భయపడిన ఆ బాలిక బైటకు చెప్పుకోలేక..తండ్రి పెట్టే దారుణమైన హింస భరించలేక అల్లాడిపోయింది. చిత్రహింసలకు గురైంది. ఓ రోజు తెల్లవారుఝామున జరుగుతున్న ఈ దారుణాన్ని కుమార స్వామి పెద్ద కుమార్తె కంటపడింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తోడబుట్టిన చెల్లెలిపై తండ్రి చేస్తున్న దుశ్చర్యకు ఆగ్రహం వ్యక్తంచేసిన పెద్ద కుమార్తె బంధువలు తమ గోడు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది. 

వివరాల్లోకి వెళితే..15 సంవత్సరాల క్రితం హన్మకొండకు కుమారస్వామి కుటుంబం తొర్రూరుకు వసల వచ్చింది. కుమారస్వామి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిపై కుమారస్వామి కన్ను పడింది. మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తండ్రి పెట్టే హింసలు భరించలేక అక్కతో తన బాధను చెప్పుకుంది. అది విన్న అక్క షాక్ అయ్యింది. ఓ రోజు తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని కళ్లారా చూసింది. ఏం చేయాలో తెలీక..వారి బంధువులకు ఈ విషయాన్ని చెప్పి వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.దీంట్లో భాగంగా..స్థానికులను..బాధితురాలి బంధువులను విచారిస్తున్నారు.