Father Killed Daughter Lover : కూతుర్ని ప్రేమించాడని కాళ్లు,చేతులు నరికి హత్య

ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. తన కూతుర్ని ప్రేమించిన యువకుడిని దారుణంగా కాళ్లు చేతులు నరికి చంపిన తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Father Killed Daughter Lover : కూతుర్ని ప్రేమించాడని కాళ్లు,చేతులు నరికి హత్య

Father Killed

Father Killed Daughter Lover : ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. తన కూతుర్ని ప్రేమించిన యువకుడిని  దారుణంగా కాళ్లు చేతులు నరికి చంపిన తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని  పెదకాకాని  మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియేట్   చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని  నిర్ణయించుకున్నారు.

ఈ విషయం యువతి తల్లితండ్రులకు తెలిసింది. వెంకటేష్ ను పిలిపించి గ్రామ పెద్దల  ముందు పంచాయతీ పెట్టారు. పంచాయతీ జరిగిన తర్వాత నుంచి వెంకటేష్   గ్రామం నుంచి వెళ్లిపోయాడు.  కానీ ప్రేమించిన యువతితో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు.

ఈ విషయం గ్రహించిన యువతి తండ్రి భాస్కరరావు కోపంతో రగిలి పోయాడు. ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి  మట్లాడదాం రమ్మని వెంకటేష్ ను గ్రామంలోకి పిలిచాడు. అక్కడి నుంచి ఊరి చివర నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాడు.

అక్కడ వేచి ఉన్న వారి  బంధువులు మరో 6గురితో కలిసి ఆయుధాలతో వెంకటేష్ పై తీవ్రంగా దాడి చేసారు. దాడిలో వెంకటేష్ కాళ్లు చేతులు దారుణంగా నరికేశారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి గాయపడిన వెంకటేష్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.  వెంకటేష్ పై దాడి చేసిన వారు పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.