CI Harassment : సీఐ వేధింపులతో మహిళా హోం గార్డు ఆత్మహత్యాయత్నం

సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.

CI Harassment : సీఐ వేధింపులతో మహిళా హోం గార్డు ఆత్మహత్యాయత్నం

Female Home Guard Attempt Suicide Due To Ci Harassment In Adoni

CI Harassment : సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది. ఎమ్మిగనూరులో హోంగార్డుగా  విధులు నిర్వర్తించే రామకృష్ణమ్మ అనే హోం గార్డు ఇటీవల బదిలీపై ఆదోని 3వ టౌన్ పోలీసు స్టేషన్‌కు బదిలీపై వచ్చింది. వచ్చినప్పటినుంచి స్టేషన్ సీఐ నరేష్ ఆమెను వేధించసాగాడు.

ఎందుకువచ్చావు….పనిష్మెంటా .. గొడవలు పడ్డావా… అంటూ ఆమెను ప్రశ్నలతో వేధించసాగాడు. ఇటీవల ఆమె ట్రాన్స్‌ఫర్ కాగితాలను తిప్పి పంపించాడు. తన ట్రాన్స్‌ఫర్  కాగితాలను  ఎందుకు తిప్పి పంపించారని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానించాడు. సీఐ ప్రవర్తనతో తీవ్రమనస్తాపానికి గురైన రామకృష్ణమ్మ …సీఐ వేధింపులపై సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

శానిటైజర్ తాగి అపస్మారక స్ధితిలోకి వెళ్లిన  ఆమెను చూసిన స్ధానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి  విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం ఇక్కడ వైరల్ అవుతోంది. తనను మానసిక క్షోభకు గురిచేసిన సీఐని కఠినంగా శిక్షించాలని బాధితురాలు వీడియోలో డిమాండ్ చేసింది.