డాక్టర్ ప్రియాంక హత్య కేసులో ఐదో వ్యక్తి అవాస్తవం

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఐదో నిందితుడు ఉన్నాడన్న వార్త

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 07:15 AM IST
డాక్టర్ ప్రియాంక హత్య కేసులో ఐదో వ్యక్తి అవాస్తవం

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఐదో నిందితుడు ఉన్నాడన్న వార్త

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఐదో నిందితుడు ఉన్నాడన్న వార్త అవాస్తవం అన్నారు. ఈ కేసులో ఐదో వ్యక్తి ప్రమేయం లేదని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రియాంకారెడ్డిని హత్య చేసింది నలుగురే అని ఆ నలుగురిని అరెస్ట్ చేశామని డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పుకార్లను నమ్మొద్దని కోరారు. ప్రియాంక హత్య కేసులో నలుగురు నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే క్రమంలో దుర్మార్గులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. 45 నిమిషాల పాటు రాక్షసకాండ కొనసాగించారు. బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడ్డారు. ప్రియాంక రెడ్డి తన స్కూటీ కోసం ఎదురుచూస్తున్న ప్రదేశం నుంచి ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో హెల్ప్‌ అని అరిచినప్పటికీ.. వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఎవరికీ వినిపించలేదు. తర్వాత నిందితులు ప్రియాంక నోరు నొక్కి లాక్కెళ్లారు. మద్యం మత్తులో ఉండడంతో దుండగులు ఆమెపై లైంగిక దాడి చేశారు. అప్పటికే స్పృహ కోల్పోవడం, నోరు, ముక్కును మూసేయడంతో ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది. 

అటు.. ప్రియాంకపై హత్యాచారం చేసిన నిందితులకు ఉరి వేయాలి లేదా ఎన్ కౌంటర్ చేయాలంటూ షాద్‌ నగర్‌లో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. హంతకులను ఉంచి షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరికి దూసుకొచ్చారు. దీంతో పీఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.