కంగనాతో పాటు మరో ముగ్గురిపై కాపీ రైట్ కేసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఖార్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ చండేల్, సోదరుడు అక్షత్ రనౌత్, కమల్ కుమార్ జైన్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు అయింది. దిడ్డ అనే సినిమా కథ..

కంగనాతో పాటు మరో ముగ్గురిపై కాపీ రైట్ కేసు

kangana-ranaut-

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఖార్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ చండేల్, సోదరుడు అక్షత్ రనౌత్, కమల్ కుమార్ జైన్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు అయింది. దిడ్డ అనే సినిమా కథను రచయితకు తెలియకుండానే ప్రకటించేశారు. దానిపై కాపీ రైట్ అప్పీల్ చేస్తూ అతను న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు.

దిడ్డ, ద వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్ అనే బుక్ రాసిన ఆశిశ్ కౌల్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తాను ముందుగా రనౌత్‌ను కలిశానని, ఈ మెయిల్ కూడా చేసి కథలో కొన్ని భాగాలు ఆమెకు పంపినట్లు చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత కంగనా తనకు తెలియకుండానే సినిమా అనౌన్స్ చేసేసిందట. దీనిపై స్పందించిన రనౌత్ ఈ కథ కౌల్ బుక్ ఆధారంగా తీసింది కాదని చెప్పారు.

ఆ తర్వాత బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన కౌల్.. రనౌత్ పై ఎఫ్ఐఆర్ కోసం అప్లై చేసినట్లు తెలిపారు. కోర్టు కూడా కౌల్‌కు అనుకూలంగా ఉంది. కోర్టు ఆర్డర్ ఆధారంగా సెక్షన్లు 406, 415, 418, 120 (b), 34లతో పాటుగా 51, 63, 63A కాపీ రైట్ యాక్ట్ కింద కేసు ఫైల్ అయిందని ఖార్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గజానన్ కబ్దులెకు వెల్లడించారు.

కంగనా రనౌత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘అన్ని ప్రొసీడింగ్స్ గురించి మా దగ్గర కాపీలు ఉన్నాయి. పూర్తి వివరణతో కూడిన స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రస్తుతం ఆ కంప్లైంట్ పై ఎటువంటి చేయదలచుకోవడం లేదు’ అని మీడియాతో చెప్పారు.