పార్కింగ్ వెహికల్స్ దగ్ధం : షాపింగ్ మాల్లో మంటలు 

  • Published By: sreehari ,Published On : October 3, 2019 / 03:30 PM IST
పార్కింగ్ వెహికల్స్ దగ్ధం : షాపింగ్ మాల్లో మంటలు 

షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం (అక్టోబర్ 3)రోజున కోల్ కతాలోని శాటిలైట్ టౌన్ షిప్ సాల్ట్ లేక్ దగ్గర బాయ్ శక్తి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్మోకింగ్ అలారం మోగడంతో అప్రమత్తమైన షాపింగ్ మాల్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

షాపింగ్ మాల్ బేస్ మెంట్ నుంచి దట్టమైన పొగ వ్యాపించడంతో అందులోని వారందరిని బయటకు తరలించారు. సమాచారం అందుకున్న 9 మంది అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణ హాని జరగలేదని పోలీసులు తెలిపారు. షాపింగ్ మాల్లోని అలారం మోగడంతో అందరిని బయటకు పంపించి వేశారని, లోపల ఎవరూ లేరని సెక్యూరిటీ గార్డు పోలీసులకు చెప్పాడు.

షాపింగ్ మాల్లోని బేస్ మెంట్ లో పార్కింగ్ చేసిన కొన్ని వాహనాలు మంటల్లో దగ్ధమైనట్టు చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.