Fire Broke Out : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. దువ్వ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.

Fire Broke Out : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. దువ్వ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం

fire broke out (1)

Fire Broke Out : పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. బాణాసంచా కాల్చడంతో చలువ పందిళ్లు దగ్ధం అయ్యాయి. తారా జువ్వలు పడి చలువు పందిళ్లు దగ్ధమయ్యాయి.

శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్లకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాద ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో భక్తులు అక్కడి నుండి బయటికి పరుగులు తీశారు.

కాణిపాకం ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం

సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కొంత మేర ఆస్తి నష్టం జరిగినట్లు గెలుస్తోంది.