విమానంలో మంటలు : మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రమాదం

విమానంలో మంటలు : మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రమాదం

టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విమానంలో మంటలు : మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రమాదం

టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 ఇరాన్‌ : టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని ఆ దేశ అత్యవసర విభాగం అధిపతి తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇరాన్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఫాకర్‌ 100 విమానంలో మార్చి 19 మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని అంబులెన్సులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సాంకేతిక కారణాలతో వెనుక ల్యాండింగ్‌ గేర్‌ సరైన సమయంలో తెరచుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

×