తెలంగాణలో తొలి Zero FIR : మరో యువతి మిస్సింగ్

తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 24ఏళ్ల యువతి అదృశ్యంపై సుబేదారి పీఎస్ లో

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 11:25 AM IST
తెలంగాణలో తొలి Zero FIR : మరో యువతి మిస్సింగ్

తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 24ఏళ్ల యువతి అదృశ్యంపై సుబేదారి పీఎస్ లో

తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 24ఏళ్ల యువతి అదృశ్యంపై సుబేదారి పీఎస్ లో కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. వాస్తవంగా యువతి మిస్సింగ్ కేసు శాయంపేట పీఎస్ పరిధిలోకి వస్తుంది. అయితే కుటుంబసభ్యులు వచ్చి సుబేదారి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో.. జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులే.. యువతి మిస్సింగ్ పై విచారణ చేపట్టారు.

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనతో జీరో ఎఫ్‌ఐఆర్ తెరపైకి వచ్చింది. దిశ ఘటనకు పోలీసుల అలసత్వం కూడా కారణమేనని.. దిశ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తమ పరిధి కాదంటూ పలు స్టేషన్ల చుట్టూ తిప్పారన్న ఆరోపణలొచ్చాయి. పోలీసుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తే తమ పరిధి కాదంటూ తిప్పిపంపడానికి వీల్లేదని.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జీరో ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చిన రోజుల వ్యవధిలోనే తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.

తెలంగాణలోనే కాదు..ఏపీలోనూ జీరో ఎఫ్ఐఆర్ గురించి పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తే తమ పరిధి కాదంటూ తిప్పి పంపడానికి వీల్లేదని.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. జీరో ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చిన రోజుల వ్యవధిలోనే ఏపీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది.  రాజధాని అమరావతి పరిధిలో ఒక మిస్సింగ్ కేసులో కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.