ఒడిషాలో ఏనుగు దాడి : ఐదుగురు మృతి 

  • Published By: chvmurthy ,Published On : April 19, 2019 / 07:29 AM IST
ఒడిషాలో ఏనుగు దాడి : ఐదుగురు మృతి 

ఒడిషా: ఒడిషాలోని అంగుల్ జిల్లాలో రెండు గ్రామాల్లో గురువారం రాత్రి ఏనుగు బీభత్సం సృష్టించింది. మొదటగా సాంధ్ గ్రామంలోకి  ప్రవేశించిన ఏనుగు, అర్ధరాత్రి వేళ  వరండాలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసింది. దాంతో అక్కడ ముగ్గురు మరణించారు. వీరిలో ఒక పురుషుడు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  వీరంతా ఇటుకల తయారీ కేంద్రంలో కూలీలుగా పని చేస్తున్నారు. అక్కడినుంచి వెళ్ళిన ఏనుగు గ్రామంలో మరో మహిళను తొక్కి చంపింది.

అనంతరం సంతపద అనే గ్రామానికి చేరుకుని  70 ఏళ్ల వృధ్దుడిపై పై దాడి చేసింది. మరణించిన వారిలో నలుగురు ఓకే కుటుంబానికి చెందిన వారు. 2018-19 సంవత్సరంలో ఒడిషాలో ఏనుగల దాడిలో 92 మంది మరణించి నట్లు లెక్కలు చెపుతున్నాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగును తరిమి కొట్టారు. ఏనుగుల దాడితో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గజరాజుల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.