బావిలో శవాలుగా తేలిని వలస కూలీ కుటుంబం: హత్యలా? ఆత్మహత్యాలా?!

  • Published By: nagamani ,Published On : May 22, 2020 / 05:29 AM IST
బావిలో శవాలుగా తేలిని వలస కూలీ కుటుంబం: హత్యలా? ఆత్మహత్యాలా?!

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తీవ్ర విషాదం జరిగింది.  దాదాపు 25 ఏళ్ల క్రితం పశ్చిబెంగాల్ నుంచి వరంగల్ జిల్లాలోని గొర్రెకుంటకు వలస వచ్చారు. అక్కడ ఓ గన్నీ సంచుల గోడౌన్ లో పనిచేస్తుంటూ జీవనంసాగిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వలస కార్మికుల కుటుంబంలోని ఐదుగురు ఓ బావిలో శవాలుగా తేలారు. ఈ విషాదం సమాచారం అందుకున్న పోలసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలిస్తున్నారు. దీనిపై అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  స్థానికంగా సంచలనం కలిగిస్తన్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

కోల్‌కతాకు  చెందిన మక్సూద్ (50) 25 ఏళ్ల నుంచి వరంగల్ అర్బన్ జిల్లాలోని కరీమాబాద్‌లో బార్‌దాన్ కూలీగా పనిచేస్తున్నాడు. భార్య నిషా (45), ఇద్దరు కుమారులతోపాటు భర్తతో విడాకులు తీసుకున్న కుమార్తె కూడా వారితోనే ఉంటోంది. లాక్‌డౌన్ కొనసాగుతున్నక్రమంలో  వీరి కుటుంబం పారిశ్రామికవాడలోని సాయిదత్తా బార్‌దాన్‌ ట్రేడర్స్‌లోని భవనంలోనే ఉంటోంది. అదే భవనంలో బీహార్‌ చెందిన మరికొంతమంది యువకులు కూడా ఉంటున్నారు.

ట్రేడర్స్ యజమాని గురువారం (మే21,2020)న వీరిని చూసేందుకు  భవనం వద్దకు వచ్చాడు.కానీ వీరెవరూ కనిపించలేదు. దీంతో గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలోని బావిలో శవాలు కనిపిస్తున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వారిని మక్సూద్, నిషా, వారి 22 ఏళ్ల కుమార్తె, మూడేళ్ల మనవడు, మక్సూద్ కుమారుడిగా గుర్తించారు.  

అయితే, ఐదు మృతదేహాలు లభ్యం కావడంతో అదే భవనంలో ఉంటున్న బీహార్ యువకులు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. మక్సూద్ కుటుంబం ఆత్మహత్య చేసుకుందా? లేక కనిపించకుండా పోయిన బీహారీ యవకులకు ఈ మరణాలకు సంబంధం ఉందా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా మక్సూద్ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, వారి కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తున్నక్రమంలో వారు రోజుకు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తోందని ట్రేడర్స్ యజమాని తెలిపాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read: తండ్రేనా, బెదిరించి కూతురిపై పలుమార్లు అత్యాచారం