Floods : అసోంను ముంచెత్తిన వరదలు..63 మంది మృతి

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో రెస్క్యూటీమ్స్‌ నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. డిమా హసావో, గోల్‌పరా, హోజాయ్‌, కమ్‌రూప్‌, కమ్రూప్‌, మోరిగావ్‌ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.

Floods : అసోంను ముంచెత్తిన వరదలు..63 మంది మృతి

Assam

Floods in Assam : అసోంను వరదలు ముంచెత్తాయి. 32 జిల్లాల్లోని 31 లక్షల మంది వరదలతో అష్టకష్టాలు పడుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాల్లోకి తరలించారు. లక్షా 56వేల మంది 514 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా మరో 8మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 63కి పెరిగింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో రెస్క్యూటీమ్స్‌ నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. డిమా హసావో, గోల్‌పరా, హోజాయ్‌, కమ్‌రూప్‌, కమ్రూప్‌, మోరిగావ్‌ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నాగోన్ జిల్లాలో కోపిలి నది ఉధృతికి మించి ప్రవహిస్తోంది.

Jammu and Kashmir : భారీ వరదలు, కొట్టుకపోయిన ఇళ్లు…నలుగురు మృతి

బ్రహ్మపుత్ర, జియా-భరాలి, పుతిమరి, పగ్లాడియా, మానస్, బెకి, బరాక్ , కుషియారా వంటి నదులు వివిధ ప్రాంతాలలో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ని కర్బీ ఆంగ్లోంగ్, మోరిగావ్, నాగావ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. వదరల ధాటికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 216 చోట్ల రోడ్లు, ఐదు వంతెనలు, నాలుగు కట్టలు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి.