Chain Snatcher : భార్య కోరికలు తీర్చేందుకు చైన్ స్నాచర్‌గా మారిన భర్త, యూట్యూబ్ లో చూసి…

భార్య కోరికలు తీర్చేందుకు ఓ భర్త దారితప్పాడు. ఏకంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు.

Chain Snatcher : భార్య కోరికలు తీర్చేందుకు చైన్ స్నాచర్‌గా మారిన భర్త, యూట్యూబ్ లో చూసి…

Chain Snatcher

Chain Snatcher : భార్య కోరికలు తీర్చేందుకు ఓ భర్త దారితప్పాడు. ఏకంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. పుణెలోని వాకడ్‌ ప్రాంతానికి యాదవ్‌(20) ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. ఇటీవలే అతడికి వివాహమైంది. కొత్తగా పెళ్లైంది.. భార్యను బాగా చూసుకోవాలని అనుకున్నాడు. ఆమెను సంతోష పెట్టాలనుకున్నాడు. అయితే ఆమె కోరికల చిట్టా విప్పడంతో యాదవ్‌కు దిమ్మతిరిగిపోయింది.

ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా తనకొచ్చే జీతంతో భార్య కోరికలు తీర్చలేనని అతడికి అర్థమైంది. అంతే, అతడు దారితప్పాడు. చైన్‌ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. రంగంలోకి దిగడానికి ముందు యూట్యూబ్ లో పలు చైన్‌ స్నాచింగ్‌ వీడియోలను చూశాడు.

చైన్‌ స్నాచింగ్‌ కోసం యాదవ్‌ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం వాకడ్ ప్రాంతాన్ని తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు యాదవ్‌. ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించసాగాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ లో ఉన్న పోలీసులకు యాదవ్‌ కదలికల్లో తేడా పసిగట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భార్య కోరికలు తీర్చేందుకు యాదవ్ ఏకంగా దొంగగా మారిన విషయం తెలిసి అంతా విస్తుపోయారు. కాగా, పోలీసులకు చిక్కే వరకు ఏడు ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డానని.. సుమారు 121 గ్రాముల బంగారం, రెండు బైక్‌లు దొంగిలించానని విచారణలో యాదవ్ తెలిపాడు.