శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోటి మూడు లక్షల విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 07:56 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోటి మూడు లక్షల విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరుచుగా అక్రమంగా తరలిస్తున్న బంగారం, డబ్బు పట్టుడుతుంది. తాజాగా ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కోటి మూడు లక్షల విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ వెళ్తున్న ఓల్డ్ సిటీ చంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బుకు సంబంధించి అధికారికంగా అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల అధికారులు అతని నుంచి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో డబ్బును దుబాయ్ కు తరలించడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా సమాచారం అందించారు. అధికారుల విచారణ అనంతరం కరెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.