వరంగల్ వలస కూలీలవి హత్యలే.. ఫోరెన్సిక్ నిపుణులు రజమాలిక్ అనుమానం

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 08:21 AM IST
వరంగల్ వలస కూలీలవి హత్యలే.. ఫోరెన్సిక్ నిపుణులు రజమాలిక్ అనుమానం

వరంగల్ జిల్లా గొర్రెకుంటలో అనుమానాస్పదంగా చనిపోయిన 9 మంది వలస కూలీలవి హత్యలేనని ఫోరెన్సిక్ నిపుణులు రజమాలిక్ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను ఈడ్చుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయని తెలిపారు. నాలుగు పురుష మృతదేహాలపై గాయాలున్నాయని వెల్లడించారు.  చిన్నపిల్లవాడిపై తప్ప అందరి మీద గీకుడు గాయాలున్నాయని తెలిపారు. ఏడు మృతదేహాల ఊపరితిత్తుల్లో నీరు చేరినట్లు చెప్పారు. బిల్డింగ్ పై నుంచి తోసేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 

మహిళలపై అత్యాచారం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికలో వస్తుందని రజమాలిక్ తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామని చెప్పారు. మత్తు మంద, విష ప్రయోగంపై బలమైన అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇక నలుగురు పురుషుల మృతదేహాలపై గాయాలున్నాయని పేర్కొన్నారు. 

తొమ్మిది మంది మృతదేహాలు బావిలో పడి తేలాయి. వాటిని తీసుకొచ్చి మార్చురీలో ఉంచామని తెలిపారు. ఆ తొమ్మిది శవాలకు తానే పోస్టుమార్టం చసినట్లు రజమాలిక్ స్పష్టం చేశారు. నీళ్లల్లో పడి చనిపోయినట్టు పోస్టుమార్గం రిపోర్టు ఫైడింగ్ లో ఉందన్నారు. పోస్టుమార్టం చేసే క్రమంలో మృతదేహాలపై ఉన్న గీరుడు గాయాలను గుర్తించామని తెలిపారు. గుర్తించిన విషయాలను సంబంధిత టెస్టుల ప్రకారం ఏదైనా విషయం ప్రయోగం జరిగిందా… వారే బావిలో పడ్డారా.. అనే కోణంలో ఆలోచించి దానికి సంబంధించి నమూనాలు సేకరించి టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారని చెప్పారు.

గాయాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేపట్టారు. పోస్టుమార్టం చేసిన రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ కు వెళ్లి చూడలేదు.. మరుసటి రోజు సంఘటనా స్థలానికి వెళ్లి చూశానని తెలిపారు. బతికి ఉండగానే వారిని బావిలో పడేసినట్లు అనిపిస్తోందన్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లిందని..కాకపోతు మూడు మృతదేహాల ఊపరితిత్తుల్లోకి నీరు చేరలేదన్నారు.  
బతికి ఉండగా లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు వారిని బావిలో పడేసినట్లు అనుమానం ఉందని..ఈ విషయాన్నే పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. 

తీవ్ర గాయాలు లేవని..కొట్టి చంపినట్లు లేదన్నారు. లోపల గాయాలు లేవని.. పైపైన గీకుడు గాయాలున్నాయని చెప్పారు. అయితే కొన్ని మృతదేహాలు కుళ్లిపోయాయని కాబట్టి గుర్తించడం ఇబ్బంది కల్గిందని చెప్పారు. కానీ గాయాలను మాత్రం గుర్తించామని తెలిపారు. ఆ కోణంలోనే పోలీసులు విచారణ చేపట్టారని చెప్పారు. ఫోరెన్సిక్ పరంగా అనుమానం వస్తుందని కాబట్టి వాళ్లంతటా వాళ్లు బావిలో పడలేదని..వేరే వ్యక్తుల పాత్ర ఉందని పోలీస్ డిపార్ట్ మెంట్ కు క్లూస్ ఇచ్చామని తెలిపారు. కచ్చితమైన డెసిషన్ మాత్రం రాలేదు. వారంతట  వాళ్లు పడేదానికి వేరే వాళ్లు తోస్తే పడిందానికి తేడా ఉంటుందని తెలిపారు. 

వరంగల్‌ జిల్లా గొర్రెకుంటలో 9 మంది వలస కార్మికులది హత్యగా పోలీసులు నిర్ధారించారు. చంపి బావిలో పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు గొర్రెకుంటలో 9 మంది డెత్‌ మిస్టరీపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. వ్యవసాయ బావిలో తొమ్మిది మృతదేహాలు తేలిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గొర్రెకుంటలోని బావిని పరిశీలించారు. తొమ్మిది మృతదేహాలు ప్రాణాలతో ఉండగానే బావిలో పడి చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో తేల్చారు. 

ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసు ప్రత్యేక బృందాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురు ఆనుమానితులను అదుపులోకి తీసుకున్న సిట్‌ పోలీసులు, శనివారం గొర్రెకుంటలోని బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన చేశారు. ఒకరు బుస్రా ఖాతూన్‌ ప్రియుడు యాకూబ్‌ కాగా, మరో ఇద్దరు బీహార్‌కు చెందిన కార్మికులు. 

యాకూబ్‌ను శుక్రవారమే అదుపులోకి తీసుకోగా,  శనివారం బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్, మంకుషాను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌కుమార్‌ యాదవ్, మంకుషాను సంఘటన వద్దకు తీసుకువచ్చి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ తరహాలో పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉండే ఇద్దరు బీహారీల గదిని అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. 

బంగ్లా మీది నుంచి ఎవరైనా బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. మరోవైపు గొర్రెకుంట ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు.