Uttarakhand : పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి

మనవరాలిపై లైంగికవేధింపులకుపాల్పడ్డారనే ఆరోపణలతో మనస్తాపం చెందిన ఒక మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.

Uttarakhand : పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి

Uttarakhand

Uttarakhand :  మనవరాలిపై లైంగికవేధింపులకుపాల్పడ్డారనే ఆరోపణలతో మనస్తాపం చెందిన ఒక మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ నగరంలో నివసించే రాజేంద్ర బహుగుణ పై ఆయన కోడలు  ఆరోపణలు చేసింది.  తన కూతురుని మామ  రాజేంద్ర బహుగుణ  లైంగికంగా   వేధిస్తున్నారని బుధవారం ఆయనపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.   కోడలు ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన బహుగుణ గురువారం ఎమర్జెన్సీ   పోలీసు నెంబర్ 112 కి ఫోన్ చేసి  తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు.  వెంటనే   పోలీసులు అక్కడకు చేరుకున్నారు.  అప్పటికే ఆయన ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకోటానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ లోపు పోలీసులు ఆయన ప్రయత్నాన్ని విరమింప చేయటానికి లౌడ్ స్పీకర్లతో మాట్లాడటానికి ప్రయత్నించారు.

ఒక దశలో ఆయన రాజీపడినట్లు కనిపించారు. కానీ అంతలోనే తన చేతిలోని తుపాకీతో హఠాత్తుగా గుండెలపై   కాల్చుకుని అక్కడి కక్కడే మరణించారు. ఈఘటనపై స్ధానిక పోలీసు అధికారి పంకజ్ భట్ మాట్లాడుతూ…కుటుంబ సభ్యుల  నుంచి ఆరోపణలు రావటంతో ఆయన తీవ్రంగా కలత చెందారని పేర్కోన్నారు.

రాజేంద్ర బహుగుణ గతంలో ఎన్డీ తివారి మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా పని చేశారు. రాజేంద్ర కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి, ఒక పొరుగింటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి