Hash Oil Smuggling : హాష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి లో దిగారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు.

Hash Oil Smuggling : హాష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్

Hash Oil

hash oil smuggling : హాష్ ఆయిల్ అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుండి ఢిల్లీకి గంజాయి, హాష్ ఆయిల్ అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. వీరి నుంచి 52 కిలోల గంజాయి, లీటర్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇది యూపీకి చెందిన గ్యాంగ్ అని వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన ఇమ్రాన్ ఈ గ్యాంగ్ ని వైజాగ్ ఏజెన్సీ ఏరియాకి పంపి గంజాయి తెప్పిస్తున్నాడని పేర్కొన్నారు. మార్కెట్లో హాష్ ఆయిల్ లీటర్ కి రూ.3 లక్షల రేట్ ఉందన్నారు. కేజీ 10 వేలు ఉండే గంజాయి రేటు… 15 వేలకు పెరిగిందని తెలిపారు. వైజాగ్ లోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో గంజాయితో ట్రైన్ ఎక్కారని చెప్పారు. మౌలాలి రైల్వేస్టేషన్ లో దిగారని, అక్కడ వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Hash Oil Sales Gang : హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్-5.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి లో దిగారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు. వైజాగ్ నుంచి గరీబ్ రథ్ ట్రైన్ లో ఏసీ టికెట్స్ బుక్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నారని తెలిపారు. ఇమ్రాన్ ని పట్టుకోవడానికి టీమ్స్ ని ఢిల్లీకి పంపిస్తున్నామని తెలిపారు.