Vizag Murder Case : వ్యసనాలకు అలవాటు పడి వేధిస్తున్నాడని హత్య

విశాఖపట్నం మహరాణి పేటకు చెందిన శ్యామ్ అనే యువకుడి హత్యకేసు మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన తల్లి, అక్క, బావలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Vizag Murder Case : వ్యసనాలకు అలవాటు పడి వేధిస్తున్నాడని హత్య

Four Family Members Arrested In Shyam Murder Case In Vizag

Vizag Murder Case :  విశాఖపట్నం మహరాణి పేటకు చెందిన శ్యామ్ అనే యువకుడి హత్యకేసు మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన తల్లి, అక్క, బావలను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాణిపేట, తాడి వీధికి చెందిన టేకుమూడి శ్యామ్ (21) గత ఆదివారం అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. స్ధానిక కార్పోరేటర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్యామ్ ను కుటుంబ సభ్యులే హత్యచేసినట్లు అనుమానించి వారిని అదుపులోకి తీసుకుని విచారించే సరికి నిజాలు బయటపడ్డాయి.

శ్యామ్ సోదరి లక్ష్మిదుర్గ  అలియాస్ ఫాతిమాకు ఆరోగ్యం బాగోక పోవటంతో వారం రోజుల క్రితం తల్లి సుగుణ  దగ్గరకు వచ్చింది. సుగుణ కొడుకు శ్యామ్ కుమార్ ముడేళ్లుగా బైక్ కొనమని వేధిస్తుండటంతో…నాలుగు నెలల క్రితం ఫైనాన్స్ మీద బైక్ కొని ఇచ్చింది.

చెడు వ్యసనాలకు   అలవాటు పడిన శ్యామ్ నెల రోజుల క్రితం బైక్ ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని జల్సా చేశాడు.  ఆబైక్ ను విడిపించి ఇవ్వమని తల్లితో రోజూ గొడవ పడుతున్నాడు.  ఆదివారం రాత్రి తాగి వచ్చి తల్లి సుగుణను, సోదరి ఫాతిమాను బైక్ విషయమై విపరీతంగా వేధించాడు.  కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన సుగుణ కొడుకును అంతమొందించాలనుకుని ముందే నిర్ణయించుకుంది.

ఆదివారం రాత్రి  శ్యామ్ ఇంట్లో వాళ్లను వేధించేసరికి… అప్పటికి ముందుగానే ప్లాన్ చేసుకున్న సుగుణ  తన పెద్దల్లుడు ఫాతిమా భర్త షేక్ పీర్ సాహెబ్, చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్ కు ఫోన్ చేసి ఇంటికి  రమ్మని పిలిచింది.

శ్యామ్ నిద్రపోయిన తర్వాత అల్లుళ్లు  ఇద్దరూ ఒకరు….శ్యామ్ కాళ్లమీద కూర్చోగా, మరోకరు చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. కూతురు ఫాతిమా, శ్యామ్ ముఖంపై దిండు గట్టిగా అదిమి పెట్టి  ఊపిరాడకుండా చేసింది. తల్లి సుగుణ ట్రాక్  నాడాను తీసుకుని శ్యామ్ మెడ చుట్టూ బిగించటంతో శ్యామ్ ఊపిరాడక చనిపోయాడు.

శ్యామ్ అనుమానాస్పద మృతిపై  30వ డివిజన్ కార్పోరేటర్ అప్పల కొండ మహరాణి పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.