Madhya Pradesh : మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌కు నిప్పంటించిన న‌లుగురు వ్యక్తులు

దీంతో ఆగ్ర‌హానికి గురైన అమిత్ రాయ్ మ‌రో ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి బాధితురాలికి నిప్పంటించారు. న‌లుగురు వ్య‌క్తులు మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌కు నిప్పంటించారు.

Madhya Pradesh : మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌కు నిప్పంటించిన న‌లుగురు వ్యక్తులు

Set Fire

madhya pradesh : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం జరిగింది. న‌లుగురు వ్యక్తులు మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌కు నిప్పంటించారు. ఈ ఘోర ఘటన విదిశలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జూన్‌ 28న అమిత్ రాయ్ అనే వ్యక్తి మధు అనే మహిళ ఇంటి బయట నిలబడి ఉన్నాడు. ఆమె త‌ల్లి అత‌డిని అక్క‌డి నుంచి వెళ్లిపోవాలని చెప్పింది.

దీంతో ఆగ్ర‌హానికి గురైన అమిత్ రాయ్ మ‌రో ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి బాధితురాలికి నిప్పంటించారు. న‌లుగురు వ్య‌క్తులు మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌కు నిప్పంటించారు. స్ధానికులు మంట‌లార్పి ఆమెను చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నారు.

Myanmar Military attack:మయన్మార్ లో మారణహోమం..చేతులు కట్టేసి..11మందిని సజీవ దహనం చేసిన మిలటరీ బలగాలు

మొత్తం ఘ‌ట‌న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావ‌డంతో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌ధాన నిందితుడిని అమిత్ రాయ్‌, బాధితురాలిని మ‌ధుగా గుర్తించారు. మ‌ద్యం మ‌త్తులో ఈ నేరానికి పాల్ప‌డిన‌ట్టు నిందితుడు అంగీక‌రించాడు.