న్యూడ్ ఫొటోల బెదిరింపు కేసులో మరో నలుగురు అరెస్టు..నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతున్న పోలీసులు

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 06:23 PM IST
న్యూడ్ ఫొటోల బెదిరింపు కేసులో మరో నలుగురు అరెస్టు..నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతున్న పోలీసులు

గుంటూరులో సంచలనం రేపిన న్యూడ్ ఫోటోల బెదిరింపు కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ1, ఏ2లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో వారి నుంచి కీలక విషయాలను రాబట్టారు. ఘటనలో పాలుపంచుకున్న వారంతా ఒకే కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశారు. అయితే మొత్తం ఎపిసోడ్ పై రౌడీ షీటర్ల పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇటీవల యువతి నగ్న చిత్రతాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి, బెదిరించిన కేసులో దాదాపు తొమ్మిది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఏ1, ఏ2 లను రెండు రోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీరు చెప్పిన ఆధారాల ప్రకారం మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో లేడీస్ పాత్ర ఎంత వరకు ఉందని విచారణ చేస్తున్నారు.

అయతే రౌడీ షీటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు..వారిలో కొంతమంది సెటిల్ మెంట్ చేస్తున్నారన్న విషయంపై కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. మరోవైపు నగ్న చిత్రాలు పోస్టు చేసిన హ్యాకర్ ద్వారా ఇదంతా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ హ్యాకర్ ఎవరు అనేదానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.