అందమైన అమ్మాయిలతో మాసాజ్ పేరుతో పిలిచి రూ.55 లక్షలు దోచేశారు

అందమైన అమ్మాయిలతో మాసాజ్ పేరుతో పిలిచి రూ.55 లక్షలు దోచేశారు

Four Nigerian women robbed from indian man Rs.55 lakhs in Dubai : కొంగు కనపడితే చాలు చొంగ కార్చుకుంటారు మొగాళ్లు అని ఒక సామెత ఉంది. ఆడవాళ్ల ద్వారా ట్రాప్ చేయించి జరిగినమోసాలెన్నోఉన్నాయి ప్రపంచంలో. దుబాయ్ లో అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయిస్తామని చెప్పి, అక్కడకు వెళ్ళగానే బెదిరించి… అతడి ఎకౌంట్ నుంచి రూ.55 లక్షలు కొట్టేసిన ఉదంతం వెలుగు చూసింది.

దుబాయ్ లో నివసిస్తున్న ఒక భారతీయుడు(33) 2020 నవంబర్ లో ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ లో అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయబడును అనే ప్రకటన చూసి అందులో ఇచ్చిన నెంబరును సంప్రదించాడు. భారతీయ కరెన్సీలో మసాజ్ కు (200 దిర్హామ్స్) రూ. 3,950 మాత్రం చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అబ్బో ఇంకేం చాలా చీప్ అనుకున్నాడు.

మసాజ్ చేయించుకోటానికి దుబాయ్ లోని అల్ రెఫా అనే ప్రాంతానికి రావాల్సిందిగా ఆఫోన్ నెంబరులో వాళ్లు చెప్పారు. మన భారతీయుడు వారు చెప్పిన అడ్రస్ కు వెళ్లాడు. వారు చెప్పిన అపార్ట్మెంట్ లోకి   వెళ్లగానే అక్కడ ఉన్న నలుగురు నైజీరియన్ మహిళలు అతడ్ని బంధించారు. మెడపై కత్తిపెట్టి బెదిరించి అతని బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు.

అతడి క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 55,30,806 ను దోచుకున్నారు. ఒకరోజంతా బంధించిన అనంతరం అతని ఐ ఫోన్ కూడా లాక్కోని అక్కడ్నించి పంపించారు. బతుకుజీవుడా అంటూ బయటపడిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాంకు శాఖను అప్రమత్తం చేశాడు.

ఈ కేసుకుసంబంధించి పోలీసులు ముగ్గురు నైజీరియన్ మహిళలను షార్జాలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఒకమహిళ టిండర్ ద్వారా బాధితుడ్ని సంప్రదించినట్లు ఒప్పుకున్నది. వారిపై దోపిడీ, వ్యభిచారం, బెదిరింపులు, బలవంతపు వసూళ్ళు వంటి కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నాలుగో నిందితురాలి గురించి పోలీసులు గాలిస్తున్నారు. కేసు దుబాయ్ కోర్ట్ ఆఫ్  ఫస్ట్ ఇన్ స్టాన్స్ లో విచారణ జరుపుతున్నారు.